AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నెలలో కొత్త పథకం ప్రారంభం.. రూ.5 లక్షలు పొందోచ్చు..

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. ఈ నెలలో ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించనుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ డేట్ ఫిక్స్ చేసింది. అదే ఇందిరమ్మ బీమా పథకం. ఈ స్కీమ్ ద్వారా కుటుంబపెద్ద మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు అందించనుంది.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నెలలో కొత్త పథకం ప్రారంభం.. రూ.5 లక్షలు పొందోచ్చు..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Nov 06, 2026 | 12:43 PM

Share

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రేవంత్ సర్కార్ దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఈ నెల నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ కొత్త స్కీమ్ వర్తించనుంది. ఈ నెల 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు ముహూర్తం ఖారారు చేసింది. సిద్దిపేటలో జరగనున్న బహిరంగ సభలో ఈ కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబసభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతాయి. ఏ కారణంతో మరణించినా ఈ బీమా సొమ్ము అందుతుంది. ఇందుకోసం ఇన్యూరెన్స్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్ కార్డు ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా చెల్లిస్తుంది.

ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం

ఇందిరమ్మ బీమా పథకం కోసం నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తాయి. ఎమ్మార్వోలు, గ్రామ పంచాయతీలు కార్యదర్శులు వీటిని సేకరించి అర్హులైనవారికి గుర్తించి ఈ పథకంలో లబ్దిదారులుగా చేర్చుతారు. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించనున్నారు. అలాగే నవంబర్ 19వ తేదీన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఇందిరమ్మ చీరలు పంపించారు. పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నాయి. దీంతో 19వ తేదీ నుంచి వీటి పంపిణీ చేపట్టేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల చీరల రంగుల్లో కూడా మార్పులు చేశారు. వివిధ రకాల రంగుల్లో చీరలను తయారుచేయించారు. సాధారణంగా బతుకమ్మ సందర్భంగా ఈ చీరలను అందించేవారు. కానీ తయారీలో జాప్యం కారణంగా ఇప్పుడు పంపిణీ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇందిరమ్మ బీమా పథకం

ఇందిరమ్మ బీమా పథకం అమలు కోసం ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే పెద్ద మొత్తంలో ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది భారంతో కూడుకున్న పని. కానీ ప్రభుత్వ  పథకం ద్వారా ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా జీవిత బీమా సౌకర్యం పొందవచ్చు.

Follow Us