AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వ శాఖలో 119 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్!

ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా కింద 119 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రీడా ప్రతిభ, సాధించిన విజయాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. ఆసక్తి ఉన్న అర్హులైన క్రీడాకారులు 2026 నవంబర్ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

కేంద్ర ప్రభుత్వ శాఖలో 119 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్!
Income Tax Department Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 06, 2026 | 10:50 AM

Share

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 10, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ట్యాక్స్ అసిస్టెంట్: 44 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 09 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 66 పోస్టులు

పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ట్యాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. నియామక ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన స్టెనోగ్రఫీ నైపుణ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పోస్టులను బట్టి అభ్యర్థుల వయోపరిమితి ఇలా ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్: 18 నుంచి 27 ఏళ్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18 నుంచి 25 ఏళ్లు.. చొప్పున ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తించే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు స్పోర్ట్స్ కోటా కింద చేపడుతున్నందున అభ్యర్థుల క్రీడా ప్రతిభకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల క్రీడా విజయాలు, ప్రదర్శన, విద్యార్హతలు, వయోపరిమితి తదితర అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

క్రీడా ధ్రువపత్రాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, అధికారుల నిబంధనలకు అనుగుణంగా జారీ అయి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత నైపుణ్య పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us