AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో పింక్ లైన్ ప్రారంభం!

బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో పింక్ లైన్ ప్రారంభం!

Samatha J
|

Updated on: Nov 05, 2026 | 12:20 PM

Share

బెంగళూరు మెట్రో పింక్ లైన్‌లోని 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం నవంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆరు నెలల నిరీక్షణ అనంతరం నిర్వహణ అనుమతులు లభించాయి. కాలేన అగ్రహార నుంచి తవరకెరె వరకు ఉన్న ఈ మార్గం దక్షిణ బెంగళూరులోని రద్దీ ప్రాంతాల ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం కల్పించనుంది. బీఎంఆర్‌సీఎల్ ఆరు రైళ్లను సిద్ధం చేసింది.

బెంగళూరు నగరవాసులకు ఇది శుభవార్త. ఐటీ రాజధానిలో అత్యంత కీలకమైన బెంగళూరు మెట్రో పింక్ లైన్‌లోని 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నూతన మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 13న ప్రారంభించనున్నారు. గత ఆరు నెలలుగా నిలిచిపోయిన నిర్వహణ అనుమతులు ఎట్టకేలకు లభించడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఈ మార్గంలో ప్రయాణాల కోసం ఆరు రైళ్లను సిద్ధం చేసింది. ఈ మార్గానికి ఇప్పటికే కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అవసరమైన భద్రతా అనుమతులు కూడా లభించాయి.మొత్తం 21.26 కిలోమీటర్ల పొడవైన పింక్ లైన్‌లో 13.76 కిలోమీటర్ల భూగర్భ మార్గం, 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం ఉన్నాయి. ప్రస్తుతం కాలేన అగ్రహార నుంచి తవరకెరె వరకు ఉన్న ఎలివేటెడ్ విభాగానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ఈ మార్గంలోని ఆరు ప్రధాన స్టేషన్లతో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. ఈ నూతన మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో దక్షిణ బెంగళూరులోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బన్నెరఘట్ట రోడ్, ఐఐఎంబీ, జేపీ నగర్, జయదేవ హాస్పిటల్ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించనుంది.

మరిన్ని వీడియోల కోసం :

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

బాలీవుడ్ స్టార్స్‌లో ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక హీరోలు!

బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష.. బడ్జెట్ కటింగ్స్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్

కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్‌

రిలీజ్ డేట్స్, ఓటీటీ అగ్రిమెంట్లపై సెన్సార్ ఎఫెక్ట్.. దర్శక నిర్మాతల నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Follow Us