28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్‌ మూవీలో నటిస్తున్న టబు

×

28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్‌ మూవీలో నటిస్తున్న టబు

90వ దశకంలో తెలుగు తెరపై తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న టబు, ఆ తర్వాత ఎంపిక చేసుకున్న చిత్రాల్లోనే నటించారు. ఇప్పుడు మాత్రం దక్షిణాదిలో వరుస ప్రాజెక్ట్‌లతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా, సౌత్‌లో నటిస్తున్న రెండు క్రేజీ సినిమాల నుంచి విడుదలైన అప్‌డేట్స్ అభిమానులను ఎంతగానో సంతోషపరిచాయి.టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ నాగార్జున, టబు జోడీకి ప్రత్యేకమైన అభిమాన బలం ఉంది. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాలతో మ్యాజిక్ చేసిన ఈ హిట్ కాంబో 28 ఏళ్ల తర్వాత మరోసారి తెరపై కనిపించనుంది. నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచే కింగ్ 100 చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పుట్టినరోజున విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్‌లో ఆమె రాజసం ఉట్టిపడే, క్లాసీ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.

Samatha J