అరటిపండ్లు దొంగిలించిన ఏనుగు పిల్ల…తల్లి ఏం చేసిందో తెలుసా?

×

అరటిపండ్లు దొంగిలించిన ఏనుగు పిల్ల…తల్లి ఏం చేసిందో తెలుసా?

సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో వైరల్‌గా మారింది, నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. ఈ వీడియోలో ఒక చిన్న ఏనుగు పిల్ల రోడ్డు పక్కన ఉన్న పళ్ల దుకాణం నుండి అరటిపండ్లను నోటితో తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో, అక్కడికి తల్లి ఏనుగు వచ్చి, తన పిల్ల చేసిన పనిని గమనించి, ఆ అరటిపండ్లను తిరిగి దుకాణంలో పెట్టినట్లుగా కనిపిస్తుంది.ఈ దృశ్యం చూసిన చాలా మంది నెటిజన్లు, తల్లి ఏనుగు తన పిల్లకు నిజాయితీ, క్రమశిక్షణ పాఠం నేర్పిందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో వేగంగా షేర్ చేయబడింది, వేల సంఖ్యలో వీక్షణలను పొందింది. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక దాగి ఉన్న అసలు నిజం బయటపడింది.జరిగిన ఫ్యాక్ట్ చెక్‌లో, ఈ వీడియో నిజమైన సీసీ ఫుటేజ్ కాదని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించబడిన సృష్టి అని స్పష్టమైంది. అంతేకాకుండా, ఈ వీడియోను మొదట పోస్ట్ చేసిన టిక్ టాక్ ఖాతా కూడా తాము పోస్ట్ చేసిన వీడియోలు AI ద్వారా రూపొందించబడినవేనని పేర్కొంది.

Samatha J