రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి రూ.5 కోట్ల బెదిరింపు కాల్ వచ్చింది. డబ్బు ఇవ్వకుంటే హత్య చేస్తామని బెదిరించడంతో, తుషార్ కపూర్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లను కూడా బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుంది.
బాలీవుడ్ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో ఒక వ్యక్తి నుండి బెదిరింపు కాల్ వచ్చింది. తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తామని ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.ఈ ఘటనతో అప్రమత్తమైన తుషార్ కపూర్ వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుషార్ కపూర్ వారం రోజుల క్రితమే తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని ఇంతకాలం బయటికి వెల్లడించలేదని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు బాలీవుడ్లో ఆందోళన రేకెత్తించాయి. 30కి పైగా చిత్రాల్లో నటించి, పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన తుషార్ కపూర్, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సోదరుడు. ఈ తాజా బెదిరింపు కాల్ బాలీవుడ్ వర్గాల్లో మరోసారి సంచలనం సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం :
షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బాలీవుడ్ స్టార్స్‌లో ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక హీరోలు!
బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష.. బడ్జెట్ కటింగ్స్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్
కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్
రిలీజ్ డేట్స్, ఓటీటీ అగ్రిమెంట్లపై సెన్సార్ ఎఫెక్ట్.. దర్శక నిర్మాతల నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

