AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నరకం నుంచ్చి బయటపడటానికి 5ఏళ్లు పట్టింది.. నిద్రపోలేదు, కాఫీ తాగుతూ కూర్చునేదాన్ని

ప్రముఖ నటి యమున తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశను, ఒక మరువలేని సంఘటనను గతంలో ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. 2011 జనవరి 20న జరిగిన ఒక సంఘటనకు సంబంధించి, తన పట్ల అసత్య, వక్రీకరించిన ప్రచారం చేయడంతో ఆమె జీవితం తలకిందులైందని తెలిపారు.

Rajeev Rayala
|

Updated on: Nov 06, 2026 | 12:39 PM

Share
ప్రముఖ నటి యమున తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశను, ఒక మరువలేని సంఘటనను గతంలో ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. 2011 జనవరి 20న జరిగిన ఒక సంఘటనకు సంబంధించి, తన పట్ల అసత్య, వక్రీకరించిన ప్రచారం చేయడంతో ఆమె జీవితం తలకిందులైందని తెలిపారు. ఓ ఛానెల్ తన ముఖాన్ని స్పష్టంగా చూపిస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో వేరొక మహిళకు సంబంధించిన అభ్యంతరకరమైన, బ్లర్ చేసిన దృశ్యాలను చూపించిందని యమున ఆవేదన వ్యక్తం చేశారు.

1 / 5
ఇది చూసిన ప్రేక్షకులు ఆ దృశ్యాలు తనవేనని నమ్మే విధంగా ఆ ఛానెల్ ప్రసారం చేసిందని, "రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" వంటి పదాలను ఉపయోగించి తప్పుడు కథనాన్ని అల్లిందని ఆమె వివరించారు. ఈ ప్రచారం తనను తీవ్ర మానసిక వేదనలోకి, డిప్రెషన్‌లోకి నెట్టిందని ఆమె అన్నారు. ఈ సంఘటన తరువాత, దాదాపు ఒక సంవత్సరం పాటు (2012 ఫిబ్రవరి వరకు) ఆమె తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. వారం రోజుల పాటు నిద్రపోలేదని, కాఫీ తాగుతూ కూర్చునేదాన్నే తప్ప భోజనం కూడా చేయలేదని ఆమె చెప్పారు.

2 / 5
తన పేరును, తన జీవితాన్ని, చివరికి అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడాన్ని కూడా తాను అసహ్యించుకున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో మణిపాల్ ఆసుపత్రిలో మానసిక చికిత్స నిమిత్తం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ, కోలుకుంటున్న సమయంలో, అదే తప్పుడు వార్తను మళ్ళీ టీవీలో చూడటంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. గట్టిగా అరవడం, ఏడవడం, చికిత్సకు ఇచ్చిన మాత్రలను పడేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. మీడియా నిజాలను మాత్రమే చూపాలని, సంచలనం కోసం అసత్య కథనాలను సృష్టించవద్దని యమున ఆకాంక్షించారు.

3 / 5
ఒక వ్యక్తి, వారి కుటుంబంపై ఇలాంటి ప్రచారాలు చూపే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, తప్పుడు సమాచారం వల్ల ప్రజలు వాస్తవాలను నమ్మరని ఆమె వాదించారు. ఈ తప్పుడు ప్రచారం కారణంగా తాను కోలుకోవడానికి ఐదేళ్లు పట్టిందని, వ్యక్తిగతంగా బయటపడటానికి మూడేళ్లు పట్టిందని ఆమె వివరించారు. ఈ కష్టకాలంలో తన కుటుంబం అందించిన మద్దతును యమున గుర్తుచేసుకున్నారు. తన భర్త, పిల్లలు, అత్తమామలు, తల్లి, సోదరీమణులు తనకు అండగా నిలిచారు.

4 / 5
ముఖ్యంగా తన భర్త ఒక తండ్రిలా తనకు తోడుగా ఉన్నారని, పిల్లలు, ముఖ్యంగా తన చిన్న కూతురు తనను ఓదార్చి, తినిపించి, మానసికంగా బలంగా నిలబడేలా చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు తనను డిప్రెషన్ నుండి బయటపడేయడానికి చిత్తూరు నుండి తమిళనాడుకు కూడా వెళ్ళారని తెలిపారు. ఈ సంఘటనపై న్యాయ పోరాటం చేసిన యమున, కేసులో విజయం సాధించారు. న్యాయం గెలిచింది కాబట్టే తాను ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానని ఆమె అన్నారు. అయితే, తన విజయాన్ని, వాస్తవాలను ఏ మీడియా కూడా ప్రసారం చేయకపోవడం పట్ల ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సంచలనం కోసం తప్పుడు వార్తలను వేగంగా ప్రచారం చేసిన మీడియా, న్యాయ విజయాన్ని మాత్రం విస్మరించిందని ఆమె వ్యాఖ్యానించారు.

5 / 5
Follow Us