స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. ఒక్క తప్పుతో సౌత్ ఇండస్ట్రీలో బ్యాన్
Rajitha Chanti
Pic credit - Instagram
05 November 2026
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఏలిన ముద్దుగుమ్మ ఇలియానా డిక్రూజ్. దేవదాసు సినిమాతో పరిచయమై, పోకిరితో ఓవర్ నైట్ సెన్సేషన్ అయింది.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించి సౌత్ చిత్ర పరిశ్రమను ఊపేసింది
అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇలియానా ఉన్నపళంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు దూరమైంది. హిందీలో సినిమాలు చేసింది.
అయితే దీనికి వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇటీవల ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. నిర్మాత తెలిపిన వివరాల ప్రకారం..
ఇలియానా ఒక తమిళ సినిమా కోసం ఓ నిర్మాత నుంచి రూ. 40 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది. అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆమె కాల్షీట్లు కేటాయించలేదు.
అలాగని ఆ డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో సదరు తమిళ నిర్మాత నిర్మాతల మండలిని ఆశ్రయించారు. నిర్మాతల మండలి లాగ్ షీట్లను విచారించగా
అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలకు కేటాయించిన తేదీల్లోనే ఇలియానా వేరే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తేలింది. నిర్మితమైన రూల్స్ ప్రకారం అడ్వాన్స్ తీసుకుని
సినిమా షూటింగ్‌కు రాకపోతే ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాతల మండలి ఆమెను బ్యాన్ చేశారట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్