అనుపమ అప్ కమింగ్ మూవీస్.. లైన్ లో ఎన్ని సినిమాలంటే

06 November 2026

Rajeev 

 భోగి : అనుపమ నటిస్తున్న ఆసక్తికరమైన తెలుగు చిత్రం. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. 

ఎల్ క్లాసికో : అనుపమ నటిస్తున్న మలయాళ సినిమాల్లో ఇది ఒకటి. రోష్ రషీద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 27, 2026న విడుదల కానున్నట్లు తెలుస్తుంది

సైకలాజికల్ థ్రిల్లర్: షాన్ దర్శకత్వంలో అనుపమ ప్రధాన పాత్రలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నారు. 

తెలుగులో మరో కొత్త సినిమా: ఇప్పటికే ఒక తెలుగు సినిమాకు అనుపమ సంతకం చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తమిళంలో రెండు సినిమాలు: అనుపమ ఇప్పటికే ఒక తమిళ సినిమాను పూర్తి చేసింది. మరో రెండు తమిళ ప్రాజెక్టులు చేయాల్సి ఉన్నాయని ఆమె వెల్లడించింది.

మలయాళంలో మూడు సినిమాలు: తన సొంత భాష మలయాళంలోనూ అనుపమ మూడు సినిమాలకు కమిట్ అయింది. 

 దక్షిణాది సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. తన హిందీ డెబ్యూ సినిమాను కూడా ప్రకటించింది.