AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఇచ్చి డబ్బు తిరిగివ్వమన్నందుకు.. ఇంత దారుణమా?.. ఏం చేశారో తెలిస్తే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఓ ఉపాధ్యాయుడిపై జరిగిన హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాకింగ్ చేస్తున్న సమయంలో రాడ్డుతో దాడి చేసి ప్రాణాపాయ స్థితికి నెట్టిన ఈ ఘటనలో, పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అప్పుగా ఇచ్చిన డబ్బుల వ్యవహారంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి ప్రధాన కారణంగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

Andhra News: ఇచ్చి డబ్బు తిరిగివ్వమన్నందుకు.. ఇంత దారుణమా?.. ఏం చేశారో తెలిస్తే..
Teacher Attack West Godavari
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 25, 2026 | 7:12 PM

Share

వాకింగ్ చేస్తున్న ఓ టీచర్‌పై గుర్తుతెలియని ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉండి ఎన్.ఆర్.పి. అగ్రహారం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరత్నంపై ఈ దాడి జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో ఆయన వాకింగ్ చేస్తుండగా ముందుగానే పొదల్లో నక్కిన ఓ మైనర్ బాలుడు రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో పడి ఉన్న వెంకటరత్నాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధిత టీచర్‌ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. బొండాడ గ్రామానికి చెందిన మందపాటి కృష్ణమూర్తికి వెంకటరత్నం గతంలో రూ. 45 లక్షలు వడ్డీకి ఇచ్చాడు. ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ. 65 లక్షలకు చేరింది. అప్పు ఎంతకీ తీర్చకపోవడంతో కృష్ణమూర్తికి చెందిన 12 సెంట్ల స్థలంలోని ఇంటిని వెంకటరత్నం తన భార్య పేరు మీద రాయించుకున్నాడు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని కృష్ణమూర్తిపై వెంకటరత్నం ఒత్తిడి తీసుకురావడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరింది.

అయితే ఇంటిని ఖాళీ చేయిస్తున్న వెంకటరత్నాన్ని ఎలాగైనా అంతమొందించాలని కృష్ణమూర్తి పథకం పన్నాడు. తన ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు వ్యక్తులు, ఒక మైనర్ బాలుడితో కలిసి హత్యకు స్కెచ్ వేశాడు. ఈ పని చేసిపెడితే రూ. 5 లక్షలు సుపారీ ఇస్తామని మైనర్ బాలుడు, మరో ఇద్దరితో కృష్ణమూర్తి, అతని కుమారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం వాకింగ్ సమయంలో మైనర్ బాలుడితో రాడ్డుతో దాడి చేయించారు. పోలీసుల దర్యాప్తులో టెక్నాలజీ ఆధారంగా ఈ కుట్ర కోణం మొత్తం బయటపడటంతో, వెంకటరత్నంపై హత్యాయత్నానికి పాల్పడిన కృష్ణమూర్తి సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us