AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajja Boorelu: రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు.. నూనె పీల్చకుండా అదిరిపోయే రుచి

మన ప్రాచీన సంప్రదాయ వంటకాలలో చిరుధాన్యాలతో చేసే పిండివంటలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ శరీరానికి అధిక బలాన్ని, రక్తాన్ని వృద్ధి చేసే సజ్జలు  మహిళల ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటివి. సజ్జలలో ఉండే పుష్కలమైన ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది; కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. సజ్జలతో ఎప్పుడూ రొట్టెలే కాకుండా, బెల్లం తీపితో పాతకాలం నాటి పద్ధతిలో చేసే 'సజ్జప్పాలు' లేదా సజ్జ బూరెలు  ఎంతో రుచిగా ఉంటాయి.

Phani CH
|

Updated on: Sep 25, 2026 | 6:07 PM

Share
కావలసిన పదార్థాలు: 1 కప్పు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టిన సజ్జలు, అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము, 2 స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, పావు టీస్పూన్ యాలకుల పొడి తీపిని బ్యాలెన్స్ చేయడానికి  చిటికెడు ఉప్పు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కేవలం బెల్లం కరిగించడానికి మాత్రమే, డీప్ ఫ్రైకి సరిపడా నూనె

1 / 5
తయారీ విధానం: ఒక కప్పు సజ్జలను నీటిలో బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం మరోసారి కడిగి, జల్లెడలో వేసి నీటిని పూర్తిగా వడకట్టాలి. ఆ తర్వాత ఒక పొడి కాటన్ బట్టపై పరిచి గాలికి అరగంట పాటు ఆరబెట్టాలి ఎండలో పెట్టకూడదు. కాస్త తడి ఆరిన సజ్జలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లెడ పట్టి బరకగా ఉన్న పొట్టును తీసేసి, నునుపైన తడి సజ్జపిండిని ఒక వెడల్పాటి తాంబూలంలో పక్కన పెట్టుకోవాలి.

2 / 5
 చిన్న పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి 2 స్పూన్ల గసగసాలు, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేలా 2-3 నిమిషాలు వేయించి పక్కన ఉంచాలి. వేరొక గిన్నెలో అర కప్పు బెల్లం, చిటికెడు ఉప్పు, కేవలం 1-2 స్పూన్ల నీళ్లు పోసి కరిగించాలి పాకం అవసరం లేదు, బెల్లం కరిగి ఒక్క పొంగు వస్తే చాలు.

3 / 5
జల్లించిన సజ్జపిండిలో యాలకుల పొడి, వేయించిన గసగసాలు-కొబ్బరి మిశ్రమం వేసి చేత్తో బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన వేడి బెల్లం నీళ్లను కొద్దికొద్దిగా జల్లెడతో వడకడుతూ పిండిలో పోయాలి. మొదట స్పూన్‌తో, ఆ తర్వాత చేత్తో కలుపుకోవాలి. పిండి జారైపోకుండా చూసుకోవాలి పొరపాటున జారైతే ఒక స్పూన్ పొడి సజ్జపిండి లేదా బియ్యప్పిండి కలుపుకోవచ్చు. పిండి మరీ గట్టిగా కాకుండా మృదువైన ముద్దలా కలుపుకుని మూతపెట్టాలి.

4 / 5
చేతికి నూనె రాసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని.. పాల ప్యాకెట్ కవర్ లేదా అరిటాకుపై పెట్టి పగుళ్లు లేకుండా మీడియం మందంలో గుండ్రంగా అప్పంలా ఒత్తుకోవాలి. బాండీలో నూనెను మీడియం హీట్ చేయాలి. అప్పాన్ని నూనెలో వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. వేసిన 10-15 సెకన్లలోనే పూరీలా చక్కగా పొంగి పైకి తేలుతుంది. వెంటనే రెండో వైపు తిప్పి, నురగలు తగ్గి మంచి రంగు రాగానే జాలి గరిటెతో తీసుకోవాలి.  అంతే, నోరూరించే బలవర్ధకమైన సజ్జప్పాలు సిద్ధం! పైన క్రిస్పీగా, లోపల కొబ్బరి-గసగసాల కమ్మదనంతో గుల్లగా ఉండే ఈ స్వీట్ తింటే ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది.

5 / 5
Follow Us
రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు..

నక్షత్రంలా కనిపించే ఈ పండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

వయసు పెరిగినా మెమరీ తగ్గొద్దా? ఈ విషయాలు మర్చిపోవద్దు!

సుందరకాండ పారాయణం ఇలా చేస్తే హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందట.. శుభ

'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?

2023లో గణితంలో నోబెల్ బహుమతి ఎవరు గెలిచారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

ట్రైన్ ఆలస్యమైందా..? రైల్వే స్టేషన్లలో రూ.100కే రూమ్..

ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ

అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా