AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు!

SBI SCO Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జోనల్ హెడ్, రీజినల్ హెడ్, రిలేషన్‌షిప్ మేనేజర్–టీమ్ లీడ్, ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. సంబంధిత డిగ్రీ/MBA/CA/CFAతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది..

SBIలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు!
SBI SCO Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 25, 2026 | 5:08 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆఖరి అవకాశం. వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి SBI ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబరు 25వ తేదీలోపు అంటే ఈ రోజు రాత్రి 11.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు..

SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • జోనల్ హెడ్ (రిటైల్) పోస్టుల సంఖ్య: 1
  • రీజినల్ హెడ్ (RH) పోస్టుల సంఖ్య: 5
  • రిలేషన్‌షిప్ మేనేజర్ – టీమ్ లీడ్ పోస్టుల సంఖ్య: 27
  • ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (IS) పోస్టుల సంఖ్య: 13
  • ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (IO) పోస్టుల సంఖ్య: 4
  • వీసీ వెల్త్ (VC Wealth) పోస్టుల సంఖ్య: 95
  • ఏవీసీ వెల్త్ (AVC Wealth) పోస్టుల సంఖ్య: 77

పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, MBA, CA లేదా CFAలో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో అవసరమైన ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 25, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ / EWS / OBC అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. SC / ST / PwBD అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు పోస్టుల వారీగా విద్యార్హతలు, పని అనుభవం, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us