AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharaja Movie: హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్.. హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'మహారాజా'కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే చైనాలో రిలీజై రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది ప్రముఖ నటుడు మాథ్యూ మెక్కానాహే హీరోగా నటించే అవకాశం ఉందని నిర్మాత సుధన్ సుందరం తెలిపారు.

Maharaja Movie: హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Maharaja Movie
Basha Shek
|

Updated on: Sep 16, 2026 | 2:11 PM

Share

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరైన విజయ్ సేతుపతి నటించిన హిట్ చిత్రం ‘మహారాజా’ ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. 2024లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద పెను సంచలనం సృష్టించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే చైనాలోనూ రిలీజై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ ఏకంగా హాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన సుధన్ సుందరం అధికారికంగా ధృవీకరించారు. కాగా భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా ‘మహారాజ్’ సినిమా భారీ విజయం సాధించింది. ఇక్కడ థియేటర్లలో 91 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా, ఓటీటీలో కూడా ప్రశంసలు అందుకుంది. ఈ అపూర్వమైన విజయాన్ని చూసి, ఒక ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన ఒక అగ్రశ్రేణి నటుడు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ప్రముఖ నటుడు మాథ్యూ మెక్కోనాహే ప్రధాన పాత్రలో కనిపించనున్నారని వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై నిర్మాత సుధన్ స్పందిస్తూ.. ‘వారు చాలా మంది నటులతో చర్చలు జరుపుతున్నారు. ఆ జాబితాలో మాథ్యూ కూడా ఉండవచ్చు. నటీనటులు స్టూడియో వివరాలను ఏజెన్సీ అధికారికంగా ప్రకటిస్తుంది’ అని పేర్కొన్నారు.

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. అలాగే సచనా నమీదాస్, కళ్యాణి షినికా, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణియం, అభిరామి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024, జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని మలుపులకు విశేష ప్రశంసలు లభించాయి. విజయ్ సేతుపతి కుమార్తె పాత్ర పోషించిన సంచన నమిదాస్, ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఒక తమిళ సినిమా కథను హాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండటం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం. ఈ హాలీవుడ్ వెర్షన్‌లో ఎవరు నటిస్తారనే దానిపై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. మొత్తానికి ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ‘మహారాజా’ చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విజయ్ సేతుపతి రోల్ లో మాథ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం,
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం,
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే