Rashmi Gautam: రేబీస్‌తో రెండేళ్ల బాలుడి మరణం.. జబర్దస్త్ యాంకర్ రష్మీ ఏమన్నారంటే?
సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే యాంకర్ రష్మికి సామాజిక స్పృహ చాలా ఎక్కువ. అందుకే సామాజిక అంశాలు, సమస్యలపై తన దైన శైలిలో స్పందిస్తుంటుంది. ఇక మూగజీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తోందీ జబర్దస్త్ యాంకర్. ముఖ్యంగా వీధి కుక్కలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

సాధారణంగా కుక్క కరిస్తేనే రేబీస్ వస్తుందనుకుంటారు చాలా మంది. అయితే ఇది చాలా పొరపాటు. తాజాగా పల్నాడు జిల్లా ఈవూరు మండలంలో రుద్రాన్ష్ అనే రెండేళ్ల బాలుడు కుక్క కరవకపోయినా రేబీస్ తో కన్నుమూశాడు. చిన్నారి ముఖంపై గాయం కాగా ఒక వీధి కుక్క ఆ గాయాన్ని నాకింది. దీంతో వైరస్ బాలుడి బాడీలోకి చేరి రేబీస్ సోకింది. దీంతో రెండు రోజుల క్రితం రుద్రాన్ష్ కన్నుమూశాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఇప్పుడిదే ఘటనపై కొందరు నెటిజన్లు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ను నిలదీశారు. సోషల్ మీడియాలో రష్మీని ట్యాగ్ చేస్తూ వరుసగా ప్రశ్నలు సంధించాడు. ‘వీధి కుక్కల నుంచి సోకే రేబీస్ వ్యాధితో ఒక రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కుక్కల గురించి పోరాడే మీరు ఆ బాలుడి మరణం పై ఏం చెబుతారు?’ అని సూటిగా ప్రశ్నించారు ఒక నెటిజన్. దీనికి స్పందించిన రష్మీ.. ‘నన్ను నిందించండి.. కించపరచండి .. దూషించండి.. నేను అసలు పట్టించుకోను. కానీ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించడం ఎప్పుడు మొదలుపెడతారు? అసలు ప్రజాధనం ఎక్కడికి వెళుతోంది? జంతు సంరక్షణ కేంద్రాలు ఎందుకంత దారుణమైన స్థితిలో ఉన్నాయి? ప్రభుత్వ పశు వైద్యశాలల్లో సరైన వసతులు, పరికరాలు ఎందుకు ఉండడం లేదు? వీధి కుక్కలు, పిల్లులకు ఎందుకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు, టీకాలు వేయడం లేదు? ఆవులు, గేదెల యజమానులకు సరైన అవగాహన, మార్గదర్శకాలను ఎందుకు అందించడం లేదు? వన్యప్రాణులు మానవ నివాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు పచ్చదనం అనేది మిగులుతుందా?
‘సొంత ప్రయోజనాల గురించి పక్కన పెట్టండి.. నా పేజీలోకి వచ్చి కీబోర్డ్ వారియర్ లా పోరాడితే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కనీసం నా దృష్టి కూడా మీపై పడదు.. మీ సమయాన్ని, శక్తిని సరైన మార్గంలో ఉపయోగించి వ్యవస్థను ప్రశ్నించడం మొదలు పెట్టండి’ అంటూ తనను విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చింది రష్మి. ప్రస్తుతం ఈ జబర్దస్త్ యాంకర్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది రష్మికి మద్దతు తెలుపుతు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఎప్పటిలాగే రష్మిని తిడుతూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
యాంకర్ రష్మీ ట్వీట్..
Shame me Degrade me Abuse me I really don’t care But if you don’t start questioning the authorities the real question Where is the money going ? Why are animal shelters in such terrible conditions? Why are govt vet hospitals not well equipped? Why are the street dogs and…
— rashmi gautam (@rashmigautam27) September 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




