AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడిటింగ్ చేసేవాళ్ళకి సూపర్ న్యూస్. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీ పని ఈజీ

వీడియో ఎడిటింగ్ కోసం ప్రముఖంగా ఉపయోగించే Adobe Premiere ఇప్పుడు Android ఫోన్లలోకి వచ్చింది. iPhoneలో విడుదలైన కొన్ని నెలల తర్వాత Android యూజర్లకు కూడా ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. మల్టీట్రాక్ టైమ్‌లైన్, టెంప్లేట్లు, ఎఫెక్ట్స్, ఆడియో మెరుగుదల వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 4K వరకు వీడియోలను ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ముఖ్యంగా యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. వాటర్‌మార్క్ కూడా ఉండదు.

ఎడిటింగ్ చేసేవాళ్ళకి సూపర్ న్యూస్. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీ పని ఈజీ
Adobe Premiere Android.jpg
Nikhil
|

Updated on: Sep 25, 2026 | 8:40 PM

Share

మొబైల్‌లోనే ప్రొఫెషనల్ స్థాయిలో వీడియోలు ఎడిట్ చేయాలనుకునేవారికి Adobe కొత్త ఎంపికను తీసుకొచ్చింది. Android కోసం వచ్చిన Premiere యాప్‌లో వీడియోలు, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను ఒకేసారి నిర్వహించవచ్చు. ఫోల్డబుల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేశారు. ప్రకటనలు లేకుండా, వాటర్‌మార్క్ లేకుండా ఉచితంగా ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని అదనపు జనరేటివ్ క్రెడిట్స్, స్టోరేజ్ కోసం చెల్లింపు ఆప్షన్లు ఉంటాయి.

మల్టీట్రాక్ ఎడిటింగ్..

Android కోసం వచ్చిన Adobe Premiereలో ఒకే వీడియోలో పలు లేయర్లను నిర్వహించేందుకు మల్టీట్రాక్ టైమ్‌లైన్ ఉంది. వీడియో క్లిప్స్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను సులభంగా అమర్చుకోవచ్చు. Enhance Audio ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి వాయిస్‌ను మరింత స్పష్టంగా మార్చుకోవచ్చు. వేగంగా వీడియోలు తయారు చేసేందుకు కస్టమ్ టెంప్లేట్లు కూడా ఉన్నాయి.

ట్రాన్సిషన్లు, క్రియేటివ్ ఎఫెక్ట్స్, Adobe Stock ఇంటిగ్రేషన్ వంటి ఆప్షన్లు కూడా లభిస్తాయి. వీడియోలను 4K రిజల్యూషన్ వరకు ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. యాప్‌లోనే వాయిస్ రికార్డర్ కూడా ఇచ్చారు. వివిధ రకాల Android ఫోన్లతో పాటు ఫోల్డబుల్ పరికరాలకు కూడా ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేశారు.

ఉచితంగా వాడొచ్చు..

ఈ యాప్‌లో మరిన్ని ఫీచర్లు త్వరలో రానున్నాయి. టెక్స్ట్ ఓవర్లేల కోసం Adobe Fonts, మొబైల్‌లోని ప్రాజెక్టులను డెస్క్‌టాప్ Premiere Proకి పంపే సదుపాయం, beat detection, cropping వంటి ఆప్షన్లను జోడించనున్నారు.

ముఖ్యంగా Adobe Premiere Android వెర్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. Creative Cloud సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. ప్రకటనలు కనిపించవు. వీడియోలపై వాటర్‌మార్క్ కూడా ఉండదు. అదనపు జనరేటివ్ క్రెడిట్స్, స్టోరేజ్ కావాలనుకునేవారు మాత్రమే చెల్లింపు అప్‌గ్రేడ్ తీసుకోవచ్చు. ఈ యాప్‌ను ఉపయోగించేందుకు కనీసం 5GB RAM, Android 13 లేదా అంతకంటే కొత్త వెర్షన్ అవసరం.

Follow Us