AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు.. మైమరిపించే లగ్జరీ సౌకర్యాలు..

హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి వచ్చే టూరిస్టులకు శుభవార్త. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు సద్దమవుతోంది. ఇందుకోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. పలు సంస్థలు బస్సులను సమకూర్చేందుకు ముందుకొస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు.. మైమరిపించే లగ్జరీ సౌకర్యాలు..
Bus
Venkatrao Lella
|

Updated on: Sep 25, 2026 | 8:28 PM

Share

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీటిని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ బస్సుల్లో పైన ఓపెన్ టాప్ ఉంటుంది. అంటే పూర్తిగా ఓపెన్ చేసి ఉంటుంది. ఇక దాని కింద డెక్ ఏసీ సౌకర్యంతో సీట్లు ఉంటాయి. ఈ ఓపెన్ టాప్ ఏరియాలో కూర్చోని పర్యాటకులు సిటీ అందాలను వీక్షించవచ్చు. నగరంలోని చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు, ఇతర పర్యాటక ప్రదేశాలను ఒకే ప్రయాణంలో ఈ బస్సుల ద్వారా వీక్షించవచ్చు. నగరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. హెచ్‌ఎండీఏ వద్ద ప్రస్తుతం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఉండగా.. వీటిని టూరిజం శాఖప రిధిలోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు.

కొత్త ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం టూరిజం శాఖ బిడ్లను ఆహ్వానిస్తోంది. అర్హతల గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హత ఉన్న సంస్థలు బిడ్లను దాఖలు చేసిన తర్వాత పరిశీలించి తర్వాతి అడుగు వేయనుంది. గతంలో జూపార్క్‌కు వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. ఇప్పుడు నగరంలో పెద్దగా కనిపించడం లేదు. త్వరలో నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. ఈ బస్సుల్లో అప్పర్ డెక్ మొత్తం పూర్తిగా ఓపెన్‌గా ఉంటాయి. పైన ఉండే కుర్చీలలో కూర్చోని నగరంలో పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. ఎటువంటి అద్దాలు అడ్డుగా ఉండకపోవడం వల్ల రోడ్ల వెంట కనిపించే చారిత్రక ప్రదేశాలు, భవనాలు, వారసత్వ కట్టడాలను చూడవచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆరు బస్సులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ బస్సు లోయర్ డెక్‌లో ఏసీ సౌకర్యం ఉంటుంది. ఒకవేళ ఎండ తీవ్రత లేదా వర్షం పడుతున్నప్పుడు లోయర్ క్యాబిన్‌లోకి చేరుకోవచ్చు. దీని వల్ల ఎండ, వానలు వల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. ఈ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. యూఎస్‌బీ ఛార్జింగ్, ఎల్ఈడీ లైటింగ్, సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మైక్రోఫోన్ వంటి ఫీచర్లు ఉంటాయి. వీటి ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తారు. డబుల్ డెక్కర్ బస్సులను ట్యాంక్ బండ్, గొల్కోండ, హైటెక్ సిటీ వంటి మార్గాల్లో తిప్పనున్నారు. దీని వల్ల నగరానికి వచ్చే టూరిస్టులు ఒకే బస్సులో అన్ని టూరిస్ట్ ప్రాంతాలను చూడవచ్చు.

Follow Us