విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు కారణం ఇదే

September 12, 2026

Subhash

ఆకాశంలో ఎగిరే విమానాలను చాలా వరకు వాటి బాడీ తెలుపు రంగులోనే కనిపిస్తుంది. వివిధ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానాలైనా ఈ విషయంలో ఒకేలా ఉంటాయి. విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారో తెలుసా?

విమానాలు

విమానాలకు తెలుపు రంగు వేయడం వెనుక కేవలం డిజైన్, అందం మాత్రమే కారణం కాదు. వేడి తగ్గించడం, నిర్వహణ సులభం చేయడం, ఖర్చులను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అందం కోసం కాదు

తెలుపు రంగు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దీంతో విమానం బాడీ ఎక్కువ వేడిని గ్రహించకుండా ఉంటుంది. ఎండలో విమానం ఎక్కువసేపు పార్క్‌ చేసి ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

సూర్యరశ్మి

విమానం ఉపరితలం తక్కువగా వేడెక్కడం వల్ల లోపలి భాగాన్ని చల్లగా ఉంచేందుకు కూలింగ్‌ సిస్టమ్‌పై పడే భారం కూడా తగ్గుతుంది. దీంతో విమాన నిర్వహణలో కొంత ప్రయోజనం ఉంటుంది.

 విమానం వేడెక్కకుండా..

విమానాలపై చిన్నపాటి పగుళ్లు, గీతలు, డెంట్లు, ఆయిల్ లేదా ఇతర ద్రవాల లీకేజీలను గుర్తించడం భద్రతకు చాలా ముఖ్యం. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌పై ఇలాంటి సమస్యలు సులభంగా కనిపిస్తాయి.

చిన్న డ్యామేజ్‌ కూడా

విమానాలు ఎక్కువసేపు సూర్యరశ్మి, వాతావరణ పరిస్థితులకు గురవుతాయి. ముదురు, ప్రకాశవంతమైన రంగులు కాలక్రమంలో ఫేడ్‌ అయ్యే అవకాశం ఎక్కువ. తెలుపు రంగులో ఈ మార్పులు తక్కువగా కనిపిస్తాయి. 

ఫేడ్ అవుతాయి

విమానానికి పెయింట్‌ కూడా బరువును పెంచుతుంది. పెద్ద విమానాలకు ఎక్కువ లేయర్లలో రంగులు వేస్తే అదనపు బరువు చేరుతుంది. అందుకే సింపుల్‌ తెల్లటి బేస్‌ కలర్‌ను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

 బరువు

వేడి తగ్గించడం, నిర్వహణలో లోపాలను సులభంగా గుర్తించడం, రంగు ఫేడ్‌ కాకపోవడం, రీపెయింటింగ్‌ ఖర్చులను తగ్గించడం వంటి కారణాల వల్ల తెలుపు రంగు విమానాలకు అత్యంత సాధారణ ఎంపికగా మారింది.

విమానాలు