ఇద్దరు యూట్యూబర్ల మధ్య లవ్.. కలిసిన రెండు రోజులకే కోమలి సూసైడ్.. అసలు ఆరోజు ఏం జరిగింది..?
Bsc చదువుతూ.. యూట్యూబర్‌గా రాణిస్తున్న కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ మహానగరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. మూడు సంవత్సరాలు మరో యుట్యూబర్ తో ప్రేమలో ఉన్న కోమలి.. తీవ్ర మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు.

Bsc చదువుతూ.. యూట్యూబర్‌గా రాణిస్తున్న కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ మహానగరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. మూడు సంవత్సరాలు మరో యుట్యూబర్ తో ప్రేమలో ఉన్న కోమలి.. తీవ్ర మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు.
మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి(21).. అఖిల్ అనే మరో యూట్యూబర్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో కోమలి సూసైడ్‌కు ప్రయత్నించగా, కుటుంబసభ్యులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. అయినా అఖిల్‌ను మరిచిపోలేకపోయిన కోమలి, గత 2 రోజుల క్రితం మళ్లీ ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోమలి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మల్లారెడ్డి యూనివర్సిటీలో Bsc చదువుతూ.. పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తోంది కోమలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్ గా రాణిస్తున్న అఖిల్ రెడ్డితో కోమలికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో మూడేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సర కాలంగా ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయారు. కోమలి మాత్రం అఖిల్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో మనస్థాపానికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు వెళ్ళిపోతా..రు ఇక్కడ ఏం జరుగుతుందో మీ కోసం ఎవరెవరు ఎంత ఏడుస్తారో.. మీకు తెలియదంటూ ఫ్రెండ్స్ చేస్తున్న రిక్వెస్ట్ పోస్టులు కన్నీరు పెట్టిస్తున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
