AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHAI: టోల్ కట్టకుండా వెళ్లారా? అయితే ఇకపై మామూలుగా ఉండదు! 72 గంటల్లో..

జాతీయ రహదారులపై టోల్ ఎగవేతకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. 2026 కొత్త నిబంధనల ప్రకారం టోల్ చెల్లించని వాహనదారులకు నేరుగా ఈ - నోటీసులు పంపుతుంది. 72 గంటల్లోపు చెల్లించకుంటే రెట్టింపు జరిమానా, 15 రోజుల్లోగా చెల్లించకపోతే వాహన సేవలు నిలిపివేస్తారు.

NHAI: టోల్ కట్టకుండా వెళ్లారా? అయితే ఇకపై మామూలుగా ఉండదు! 72 గంటల్లో..
Toll
SN Pasha
|

Updated on: Mar 19, 2026 | 8:00 AM

Share

జాతీయ రహదారులపై టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. సవరించిన జాతీయ రహదారి రుసుము నిబంధనలు 2026 ప్రకారం టోల్ ఎగవేత చేసిన వాహన యజమానులకు నేరుగా ఈ-నోటీసులు పంపే విధానం అమల్లోకి వచ్చింది. ఈ చర్యలతో టోల్ వ్యవస్థను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త విధానం ప్రకారం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC)లో నమోదు చేసిన వాహనం టోల్ చెల్లించకుండా ప్రయాణిస్తే, అది చెల్లించని వినియోగ రుసుముగా పరిగణించబడుతుంది. ఆ వెంటనే వాహన యజమానికి SMS, ఇమెయిల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ-నోటీసు పంపబడుతుంది.

ఇందులో వాహన వివరాలు, ప్రయాణించిన తేదీ, సమయం, టోల్ ప్లాజా సమాచారం, చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారం ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. నోటీసు అందిన 72 గంటలలోపు చెల్లింపు చేస్తే, కేవలం అసలు టోల్ మాత్రమే వసూలు చేస్తారు. అయితే ఆ గడువు దాటితే రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. నోటీసు తప్పుగా ఉందని భావించే వారికి కూడా అవకాశం ఉంది, 72 గంటలలోపు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును 5 రోజులలోపు పరిష్కరించాల్సి ఉంటుంది.

ఇంకా 15 రోజుల్లోగా టోల్ చెల్లించకపోతే లేదా ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోతే, బకాయి మొత్తాన్ని వాహన డేటాబేస్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల వాహనానికి సంబంధించిన కొన్ని సేవలను నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ చర్యలు టోల్ ఎగవేతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా NHAI నిర్వహిస్తున్న ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పాస్ ధర రూ.3,000 నుంచి రూ.3,075కు పెరిగింది. ఈ పెరుగుదల చిన్నదిగా కనిపించినప్పటికీ, తరచుగా జాతీయ రహదారులను ఉపయోగించే వాహనదారులపై అదనపు భారం పడనుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?