Lenin Movie Twitter Review: లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అఖిల్ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
చాలాకాలం గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ లెనిల్. లవ్, ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు మేకర్స్. ఇదివరకే ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ సోషళ్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ లెనిన్. చాలా కాలం గ్యాప్ తర్వాత అఖిల్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగదేవర సూర్యవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఎమోషనల్ రూరల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా సినిమాపై అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు జూలై 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ క్రమంలోనే ఇదివరకే సినిమా చూసిన అభిమానులు మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
లెనిన్ హిట్టు బొమ్మ..
ఉదయం నుంచి లెనిన్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా అఖిల్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖిల్ యాక్టింగ్ ఇరగదీశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిని అద్భుతంగా హ్యాండిల్ చేశారని అంటున్నారు. అలాగే అఖిల్, భాగ్య శ్రీ బోర్సే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని.. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అయ్యాయని.. ఊహించని మలుపులు ఆద్యంతం ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో హైలెట్ అయ్యిందనే చెప్పాలి. మొత్తానికి లెనిన్ హిట్టు బొమ్మ అంటున్నారు ఫ్యాన్స్.
BLOCKBUSTER REPORTS 🔥🔥🔥
Akhil performance improvement NTR Voiceover 🐅🔥Hero – Heroine Chemistry Pre-interval – Pre-Climax – Climax Reports 💥💥💥
Finally Hittuuuu bomma boys @AkhilAkkineni8 @vamsi84 ❤️❤️ #BlockbusterLenin #LENIN pic.twitter.com/DRY0RbzOOM
— appie 🎀 (@fizz_nandamuri) July 10, 2026
అఖిల్ సాలిడ్ కంబ్యాక్..
లెనిన్ సినిమాలో ప్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే 30 నిమిషాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కన్నాడు మరో అభిమాని. ఇందులో ట్విస్టులు, ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని అంటున్నారు. అఖిల్ తన కెరీర్ లో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ఇది పర్ఫెక్ట్ మూవీ అని.. ఇందులో ఊర మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని అంటున్నారు. ఇక సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బీజీఎమ్ ఫైర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
#Lenin overall Great movie for Akhil! The second half is packed with crazy twists 🤯, and the BGM is top-notch. Definitely worth a watch. https://t.co/Wn9STaLidk
— Sanjay (@Sanjay_sq) July 10, 2026
Akhil babu comeback 🔥🔥#Lenin pic.twitter.com/jYdxHlKCCt
— అభి (@Abhiiitweets) July 10, 2026
Blockbuster Lenin 🔥 Actor Akhil Babu 💥 Intense screenplay. Gripping Narration.
Gurtupettukondi ee peru.. AKKINENI AKHIL 💥#Lenin
— Chintu Nag (@vsashidharreddy) July 10, 2026
