AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ను కాపాడుకునే 5 సహజ చిట్కాలు ఇవే!

ఇల్లు ఎంత అందంగా ఉన్నా.. ఒక్కసారి చెదపురుగులు ప్రవేశిస్తే చాలు, ఖరీదైన సోఫాలు, మంచాలు, బీరువాలు, తలుపులు తక్కువ కాలంలోనే మట్టిపాలవుతాయి. చెదలు పట్టిన విషయం చాలా ఆలస్యంగా వెలుగుచూస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి, వీటిని సకాలంలో గుర్తించి, నివారించడం చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే ఘాటైన రసాయనాల కంటే, ఇంట్లోనే దొరికే వస్తువులతో చెదలను ఎలా ఓడించవచ్చో కొన్ని ముఖ్యమైన చిట్కాలను మీ కోసమే..

ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ను కాపాడుకునే 5 సహజ చిట్కాలు ఇవే!
Natural Termite Treatment
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2026 | 7:10 AM

Share

ఇంట్లోని ఖరీదైన చెక్క ఫర్నిచర్, తలుపులు, పుస్తకాలను నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన కీటకాలు చెదపురుగులు. ఇవి లోపల లోపలే చెక్కను గుల్ల చేస్తూ సర్వాన్ని నాశనం చేస్తాయి. చాలా మంది వీటికి రసాయన మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన వస్తువులతో వీటికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. వేప నూనె, వెనిగర్, నిమ్మరసం, మరియు బోరిక్ యాసిడ్ వంటి పదార్థాలు చెదపురుగుల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆర్టికల్‌లో ఇంట్లో చెదలు పట్టినట్లు ఎలా గుర్తించాలి..? ఎటువంటి కెమికల్స్ వాడకుండా వాటిని సహజంగా ఎలా నిర్మూలించవచ్చో వివరంగా తెలుసుకుందాం..

ఇంట్లో చెదలు ఉన్నాయని ఎలా గుర్తించాలి?

మట్టి గొట్టాలు: గోడల మూలల్లో లేదా చెక్క సామానులపై సన్నటి మట్టి లైన్లు లేదా గొట్టాల వంటి నిర్మాణాలు కనిపిస్తే అక్కడ చెదలు ఉన్నట్లే.

పొడి లాంటి పదార్థం: చెక్క ఫర్నిచర్ కింద సన్నటి పొట్టు లేదా ఇసుక లాంటి రేణువులు పడి ఉంటే.. చెదపురుగులు లోపల చెక్కను తినేస్తున్నాయని అర్థం.

ఇవి కూడా చదవండి

గుల్ల శబ్దం: చెక్క తలుపులు లేదా ప్లైవుడ్‌ను చేతితో తట్టినప్పుడు డొల్లగా శబ్దం వస్తే లోపల అంతా చెదలు తినేసినట్లు గుర్తించాలి.

చెదపురుగులను నివారించే 5 సహజ మార్గాలు:

వేప నూనె :

వేప నూనెలో ఉండే చేదు గుణాలు చెదపురుగులకు యమపాశం లాంటివి. ఒక కాటన్ ప్యాడ్ లేదా బ్రష్ సహాయంతో చెదలు పట్టిన చెక్క భాగాలపై వేప నూనెను బాగా రాయాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే చెదలు చనిపోతాయి.

వెనిగర్, నిమ్మరసం: అర కప్పు వెనిగర్ లో రెండు నిమ్మకాయల రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి చెదలు ఉన్న రంధ్రాలలో, మట్టి గొట్టాలపై బాగా స్ప్రే చేయాలి. ఇందులోని యాసిడ్ గుణాలకు చెదపురుగులు నశిస్తాయి.

బోరిక్ యాసిడ్:

చెదలను చంపడంలో బోరిక్ యాసిడ్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. బోరిక్ పౌడర్‌ను కొద్దిగా నీటిలో కలిపి చెక్క ఉపరితలాలపై స్ప్రే చేయాలి లేదా బ్రష్‌తో రాయాలి. ఇది చెదపురుగుల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఎండలో పెట్టడం:

చెదపురుగులకు తడి, చీకటి అంటే ఇష్టం. అవి సూర్యరశ్మిని, వేడిని అస్సలు తట్టుకోలేవు. అందుకే చెదలు పట్టిన కుర్చీలు, బల్లలు లేదా పుస్తకాలను 2-3 రోజుల పాటు ఎండలో ఉంచితే చెదలు పూర్తిగా పారిపోతాయి.

ఉప్పు నీరు:

గాఢత ఎక్కువ ఉన్న ఉప్పు నీటిని (సాల్ట్ సొల్యూషన్) చెదలు ఉన్న చోట పోయడం వల్ల కూడా అవి త్వరగా చనిపోతాయి.

ఇంట్లో ఎప్పుడూ తేమ లేకుండా చూసుకోవడం, లీకేజీలను అరికట్టడం ద్వారా చెదలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఈ సహజమైన చిట్కాలను ఉపయోగించి మీ ఇంటి లగ్జరీ ఫర్నిచర్‌ను సురక్షితంగా కాపాడుకోండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us