AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఇదెక్కడి విడ్డూరం.. ఆడపిల్లే దొరకనట్టు మొసలిని పెళ్లాడిన మేయర్.. తెల్లటి గౌను వేసి ఘనంగా వివాహ వేడుక

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింత ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. కొన్ని వినడానికి చాలా వింతగా అనిపించినప్పటికీ, స్థానిక ప్రజలు వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన ఇంటర్‌నెట్‌ వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. ఒక నగర మేయర్ ఏకంగా ఒక ఆడ మొసలిని హిందూ సాంప్రదాయ వివాహాల తరహాలోనే ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఓరీ దేవుడో ఇదెక్కడి విడ్డూరం.. ఆడపిల్లే దొరకనట్టు మొసలిని పెళ్లాడిన మేయర్.. తెల్లటి గౌను వేసి ఘనంగా వివాహ వేడుక
Female Crocodile Wedding
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2026 | 11:34 AM

Share

వార్నీ ఇదెక్కడి విడ్డూరం..ఎవరైనా మొసలిని పెళ్లి చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? కానీ, మెక్సికోలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మెక్సికోలోని ఓక్సాకా ప్రావిన్స్‌లో ఉన్న శాన్ పెడ్రో హువామెలులా అనే చిన్న పట్టణం ఈ విచిత్ర ఘటనతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడి మేయర్ విక్టర్ అగ్యిలార్ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వధువును ఎంచుకున్నారు. ఈ వధువు ఒక సాధారణ మనిషి కాదు, పెళ్లి దుస్తులు ధరించి మేయర్‌తో వివాహ బంధంలోకి ప్రవేశించిన ఒక ఆడ మొసలి. పెళ్లి మండపంలో ఆ మొసలికి తెల్లటి గౌను తొడిగారు. మేయర్ విక్టర్ తన వింత వధువును లాంఛనాలతో పెళ్లి చేసుకుని ప్రేమతో ముద్దుపెట్టుకుని, కౌగిలించుకున్నారు. అయితే, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా, భద్రతా కారణాల దృష్ట్యా మొసలి దవడలను గట్టిగా కట్టేశారు. కానీ, ఎందుకు ఇలా చేశారంటే..

పురాతన సంస్కృతి – ఆచారం:

మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో ఉన్న సాన్ పెడ్రో హువమెలులా అనే తీరప్రాంత నగర మేయర్ విక్టర్ అగ్యులర్ ఈ వింత వివాహం చేసుకున్నారు. స్థానిక చోంటల్, హువే అనే రెండు గిరిజన వర్గాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి పురాతన సాంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. ఈ ఆచారం ప్రకారం, ఒక ఆడ మొసలిని ప్రకృతి మాతకు ప్రతిరూపమైన రాకుమారి లేదా దేవతగా భావిస్తారు. స్థానిక పాలకుడు ఆ మొసలిని పెళ్లాడటం ద్వారా ప్రకృతి శక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయని వారి నమ్మకం.

ఇవి కూడా చదవండి

ముస్తాబు చేసిన మొసలి పెళ్లికూతురు:

ఈ పెళ్లి కోసం ఆ చిన్న మొసలిని ఒక నిజమైన పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు. దానికి తెల్లటి లగ్జరీ గౌను వేసి, తలపై ముసుగు కూడా ధరింపజేశారు. అయితే, పెళ్లి వేడుకలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆ మొసలి ఎవరినీ కరవకుండా ఉండేందుకు దాని నోటిని తాడుతో గట్టిగా కట్టేశారు. మేయర్ విక్టర్ అగ్యులర్ ఆ మొసలిని చేతుల్లోకి తీసుకుని స్థానిక ప్రజల డ్యాన్సులు, డప్పు వాయిద్యాల మధ్య నగర వీధుల్లో ఊరేగించారు. వేడుక ముగింపులో ఆయన ఆ మొసలి తలపై ముద్దు పెట్టి వివాహాన్ని పూర్తి చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

సమృద్ధి, శ్రేయస్సు కోసమే..

ఈ వింత ఆచారం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ పెళ్లి చేయడం వల్ల తమ నగరానికి సుఖసంతోషాలు, సంపద కలుగుతాయని స్థానికులు నమ్ముతారు. ముఖ్యంగా తీరప్రాంతం కావడంతో సముద్రంలో జాలరులకు చేపల వేట బాగా దొరుకుతుందని, భూమిపై పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు రావని విశ్వసిస్తారు. ఆధునిక కాలంలో కూడా తమ పూర్వీకుల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న మెక్సికో ప్రజల ఈ వింత పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..
విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్
  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్
  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్
 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!
 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ
వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!
వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!