AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?

పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 6:47 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల పర్సెంటేజ్ విధానంపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జూన్ 30 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినా ఇప్పటికీ స్పష్టత రాలేదు. థియేటర్ అద్దెల పెంపు, పర్సెంటేజ్ సిస్టమ్ అమలు విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చిన్న, పెద్ద సినిమాలకు వేర్వేరు విధానాలపై చర్చలు జరుగుతుండగా, తుది నిర్ణయంపై ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చిందా..? జూన్ 30న పర్సెంటేజ్ అన్న కమిటీ మాటలను నిర్మాతలు పట్టించుకోవట్లేదా..? 2026లో విడుదలయ్యే సినిమాలకు ఇందులోంచి మినహాయింపు కోరుతున్నారా..? ఇష్యూ మళ్లీ చిరంజీవి దగ్గరికే చేరబోతుందా..? ఈ పర్సెంటేజ్ సమస్య తేలేవరకు థియేటర్ల అద్దెలు పెంచాలని ఎగ్జిబిటర్లు పట్టు పడుతున్నారా..? అసలేం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? తెలుగు ఇండస్ట్రీలో థియేటర్స్ పర్సెంటేజ్ ఇష్యూ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తుంది. పెద్ది సినిమాకు ముందు వారం రోజుల పాటు ఇండస్ట్రీలో దీనిపై చర్చోపచర్చలు చాలానే జరిగాయి. చివరికి చిరంజీవి ఎంట్రీ ఇచ్చాక గానీ ఇష్యూ చల్లబడలేదు. జూన్ 30 తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఓ కమిటీ కూడా వేసారు. కానీ జూలై వచ్చినా.. పర్సెంటేజ్‌పై కన్ఫ్యూజన్ పోలేదు.. క్లారిటీ రాలేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పర్సెంటేజ్ సిస్టమ్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్లిచ్చిన గడువు కూడా అయిపోయింది. దాంతో తాజాగా జరిగిన మీటింగ్‌లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిథులు త్వరలో రెంట్స్ మీద ఓ విధానాన్ని ప్రకటిస్తామని కమిటీ ప్రతినిథులకు చెప్పి మీటింగ్ వాకౌట్ చేసారు. దాంతో ఇండస్ట్రీలో మళ్లీ పర్సెంటేజ్ నిప్పు రాజుకున్నట్లే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్స్ రెంట్స్ పెంపుదల అనేది.. హీరో అండ్ బడ్జెట్ మీద ఆధారపడి డిసైడ్ చేయాలని చూస్తున్నారు ఎగ్జిబిటర్లు. చిన్న సినిమాలకు దాదాపు ఇప్పుడున్న రెంట్స్ కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. ఒకవేళ పెంచాల్సి వస్తే.. ఏ హీరోకు ఎలా, ఏ బడ్జెట్‌కు ఎంత, ప్యాన్ ఇండియన్ సినిమాకు ఎంత పెంచాలనేది థియేటర్ ఓనర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెంట్ పెంచినా కూడా.. రూరల్‌లో ఎంత, సిటీస్‌కు ఎలా పెంచాలనేది కూడా చర్చిస్తున్నారు ఎగ్జిబిటర్లు. మరోవైపు నిర్మాతలు మాత్రం 2026లో వచ్చే సినిమాలకు పర్సెంటేజ్ సిస్టమ్ వద్దంటున్నారు. మొత్తానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరుగుతున్న ఈ పర్సెంటేజ్ పంచాయతీలో ఎవరు ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

మొబైల్‌ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్‌

దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!

Follow Us