AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upi Payments: ఏఐ ద్వారా యూపీఐ పేమెంట్స్.. త్వరలో అద్బుత ఫీచర్.. మీరు ఏం చేయనక్కర్లేదు..

కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్బుత ఫీచర్‌పై వర్క్ చేస్తోంది. అదే ఏఐ ఫీచర్. ఏఐ ఏజెంట్ల ద్వారా చెల్లింపులు జరిగేలా ఈ ఫీచర్ డెవలప్ చేస్తున్నారు. ఇందుకోసం సరికొత్త ప్రోటోకాల్‌పై వర్క్ చేస్తోంది.

Upi Payments: ఏఐ ద్వారా యూపీఐ పేమెంట్స్.. త్వరలో అద్బుత ఫీచర్.. మీరు ఏం చేయనక్కర్లేదు..
Upi
Venkatrao Lella
|

Updated on: Jul 09, 2026 | 9:07 PM

Share

దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరిగిపోతోంది. మెట్రో సిటీల్లోని పెద్ద పెద్ద షాపింగ్స్ మాల్స్ నుంచి గ్రామాల్లో ఉండే చిల్లర షాప్స్ వరకు ప్రతీచోట ప్రజలు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. మాల్స్ నుంచి చిన్న దుకాణాల వల్ల ప్రతీఒక్కరూ యూపీఐ పేమెంట్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రజలు సలువుగా పేమెంట్స్ చేయడంతో పాటు ఎంత చెల్లించామనే రికార్డ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం స్వయంగా మనం అమౌంట్ సెలక్ట్ చేసుకుని పిన్ నెంబర్ ఎంటర్ చేసి చెల్లింపులు చేస్తున్నాం. కానీ త్వరలో ఏఐ ద్వారా యూపీఐ పేమెంట్స్ జరుగుతాయి. అంటే ఏఐ ఏజెంట్ మన ఆమోదంతో చెల్లింపులు చేస్తుందన్న మాట. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్బుతమైన ఫీచర్‌ను అభివృద్ది చేస్తోంది. ఈ ఏఐ యూపీఐ ఫీచర్ ఎలా పనిచేస్తుందనేది చూద్దాం.

కొత్త ప్రొటోకాల్ రూపకల్పన

ఈ ఏఐ యూపీఐ పేమెంట్స్ ఫీచర్ కోసం యనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్‌ను ఎన్‌పీసీఐ అభివృద్ది చేస్తోంది. ప్రధాన టెక్నాలజీ కంపెనీల సహకారంతో దీనిని రూపొందిస్తున్నారు. ఈ విధానంలో ఏఐ ఏజెంట్ల ద్వారా చిన్న మొత్తంలో యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. దీని వల్ల వినియోగదారుల సమయం కూడా ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఎన్‌పీసీఐ ఈ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. అయితే అన్ని లావాదేవీలు ఏఐ ఏజెంట్లు ద్వారా జరగవు. కేవలం విద్యుత్ బిల్లులు, ట్యూషన్ బిల్లులు లాంటి యూటిలిటీ బిల్లులు, ప్రతీ నెలా అయ్యే స్థిర ఖర్చులు లాంటివి ఏఐ పూర్తి చేస్తుంది. దీని కోసం మీరు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అనుమతి ఇస్తేనే ఏఐ ఏజెంట్ చెల్లింపులు చేస్తుంది. దీని వల్ల మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఆలస్య రుసుంల నుంచి తప్పించుకోవచ్చు.

చిన్న లావాదేవీలకు మాత్రమే

ఏఐ ఫీచర్‌కు యూనిఫైడ్ ఏజెంట్ ప్రొటోకాల్ అనే పేరు పెట్టారు. ఈ ఫీచర్ కోసం ఇప్పటికే ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు, నిపుణుల నుంచి సలహాలను ఎన్‌పీసీఐ కోరింది. ఇది అందుబాటులోకి వచ్చినా ఎప్పటిలాగే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఏఐ చెల్లింపు వ్యవస్థలో ఏజెంట్ హెల్ప్ చేస్తుంది. బిల్లులు, ఇతర స్వల్ప మొత్తం చెల్లింపులు చేయవచ్చు. పెద్ద లావాదేవీలకు ఇది ఉపయోగపడదు. మొబైల్ నెట్‌వర్క్ పోస్ట్‌పెయిడ్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, గ్యాస్ సిలిండర్ చెల్లింపులు లాంటి లావాదేవీలు మాత్రమే దీని ద్వారా చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

Follow Us