AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా.. ఒకరి తరువాత ఒకరు పాగా

తమిళ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా.. ఒకరి తరువాత ఒకరు పాగా

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 5:33 PM

Share

ఒకప్పుడు తమిళ సినిమాల్లో ఇతర భాషల హీరోయిన్ల హవా కనిపించేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. శ్రీలీల, వైష్ణవి చైతన్య, శ్రీ గౌరీప్రియ, నాగదుర్గ, శ్రీదేవి, మానస చౌదరి వంటి తెలుగమ్మాయిలు వరుస అవకాశాలతో కోలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటూ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు తెలుగమ్మాయిల దూకుడు కొనసాగుతోంది.

ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో పక్క భాషల హీరోయిన్లదే హవా.. కానీ సీన్ మారిందిప్పుడు. మన టాలీవుడ్ బ్యూటీస్ వరుస ఆఫర్లతో కోలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు. ఆ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. తమిళ ఇండస్ట్రీ అంతా తెలుగమ్మాయిలే కనిపిస్తున్నారు. ఇలా టాలీవుడ్ టు కోలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన తెలుగమ్మాయిల జర్నీపై ఓ లుక్ వేద్దాం పదండి.. అంజలి, ఐశ్వర్య రాజేష్, ‘బస్ స్టాప్’ ఫేమ్ ఆనంది లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది తమిళ ఇండస్ట్రీలోనే..! ఈ జనరేషన్ బ్యూటీస్ ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. తాజాగా తమిళంలో శ్రీలీల టైమ్ మొదలైంది. పరాశక్తితో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే అజిత్ నెక్ట్స్ సినిమాలోనూ ఈమె పేరే వినిపిస్తుంది. మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరీప్రియ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. అలాగే ‘బేబీ’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన వైష్ణవి చైతన్య ప్రస్తుతం ఆర్యతో సినిమా చేస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్‌తోనూ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. యూ ట్యూబ్ ఫోక్ డాన్సర్ నాగదుర్గ కూడా తమిళంలో పవీష్ నారాయణ్‌తో LOL సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. LOL అంటే లవ్ ఓ లవ్ అని అర్థం. జూలై 10న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది రిలీజ్ అవ్వకుండానే ఇడుపు కాయితంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు నాగదుర్గ. ఇక ‘కోర్ట్’ సినిమాతో మెప్పించిన శ్రీదేవి ఇప్పటికే తమిళంలో అడుగుపెట్టేసారు. మానస చౌదరి సైతం తమిళంలో ఆర్యన్, DNA సినిమాలు చేశారు. మొత్తానికి మన తెలుగమ్మాయిలు చెన్నైలోనూ గట్టిగానే పాగా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

మొబైల్‌ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్‌

దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!

Published on: Jul 09, 2026 05:30 PM
Follow Us