AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 5:06 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మెగా158 షూటింగ్ వేగంగా సాగుతుండగా, వెంకటేష్ అనిల్ రావిపూడి చిత్రంలో కీలక షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమా దసరా లక్ష్యంగా ముందుకెళ్తుండగా, నాగార్జున తన 100వ చిత్రంపై దృష్టి సారించారు. సీనియర్ స్టార్‌ల జోరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వయసులో మాత్రమే వాళ్లు పెద్దోళ్లు కానీ స్పీడ్‌లో మాత్రం ఇంకా కుర్రోళ్లే..! మన సీనియర్ల తీరు, జోరు చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కునుకు రావడం కష్టమే. ముహూర్తం పెట్టేదే ఆలస్యం.. షూటింగ్ పూర్తయ్యే వరకు నిద్ర కూడా పోవట్లేదు. ఇప్పుడు కూడా నలుగురు సీనియర్లు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. మరి వాళ్ల బిజీపై మనం కూడా ఓ లుక్కేద్దామా.? చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మెగా158 షూట్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రామ్-లక్ష్మణ్ మాస్టర్ల నేతృత్వంలో వందల మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు బర్త్ డే కానుకగా టైటిల్ టీజర్‌ విడుదల కానుంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో చిరంజీవి డాన్‌గా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వాల్తేరు వీరయ్యను యాక్షన్ కామెడీగా తెరకెక్కించిన బాబీ.. ఈసారి సీరియస్ సినిమాతో వస్తున్నారు. ఇక వెంకటేష్ కూడా నిన్నటి వరకు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు.. తాజాగా ఈయన అనిల్ రావిపూడి సెట్‌లో అడుగు పెట్టారు.. ఓ భారీ సెట్‌లో ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి షూట్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే సన్నివేశాలు మేజర్ హైలైట్ అవుతాయంటున్నారు అనిల్. బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. దసరాకు సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతోనే గోపీచంద్ మలినేని సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు బాలయ్య. ఒకవేళ అప్పుడు మిస్సైనా.. డిసెంబర్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. మరోవైపు నాగార్జున సైతం తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. మొత్తానికి నలుగురు సీనియర్ల జోరు మామూలుగా లేదిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

మొబైల్‌ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్‌

దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!

Follow Us