AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

ఈ మధ్యన కొందరు హీరోయిన్లు ప్రేమ, పెళ్లి వంటి సున్నిత విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తోందని అదే సమయంలో నచ్చిన వ్యక్తితో పిల్లాడిని కనాలనిఉందంటూ ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tollywood: పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 10, 2026 | 6:40 AM

Share

కేరళలో పుట్టి పెరిగినా తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య లక్ష్మి. ముఖ్యంగా తమిళంలో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్య సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార. తాజాగా తమిళంలో ఈ అమ్మడు నటించిన గట్టా కుస్తీ (తెలుగులో మట్టి కుస్తీ 2) సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా అలాగే కుస్తీ క్రీడాకారిణిగా ఐశ్వర్య అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలోనే పలు సార్లు పెళ్లి చేసుకోనని చెప్పిన ఈ 35 ఏళ్ల ముద్దుగుమ్మ మరోసారి ఇదే విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

‘ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉన్నాయని బలంగా నమ్ముతా. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఇదే నమ్ముతున్నాను. కానీ గట్టా కుస్తీ 2 సినిమా షూటింగ్ సమయంలో ఒక విషయం నా మనసును ఆలోచింపజేసింది. నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర ఉంది. ఆ పాపతో నాకు కలిగిన అనుబంధం, ఒక తల్లి పాత్ర పోషిస్తున్నప్పుడు పిల్లలతో ఇంతటి బంధాన్ని పంచుకోవడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఇప్పుడు నాకు కూడా ఒక బిడ్డకు తల్లిని కావాలనిపిస్తోంది. అయితే ఒకవేళ నాకు బిడ్డ పుడితే.. ఆ చిన్నారి బాగోగులను బాధ్యతగా పంచుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తినే కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మంచి తండ్రి అనిపించుకుంటాడు. అతను మమ్మల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లిపోకుండా నేను అన్నిరకాల ప్రయత్నాలు చేస్తాను. అయితే మరో వ్యక్తిని నా లైఫ్ లోకి ఆహ్వానించే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఈ దిశగా అడుగులు వేసేలా ఇప్పుడు నాలో మార్పులు వస్తున్నాయి’ అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మట్టి కుస్తీ 2 సినిమాలో ఐశ్వర్య లక్ష్మి..

View this post on Instagram

A post shared by Pandigai (@pandigaitamil)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రధాని మోదీ శాంతి మంత్రాన్ని ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు
ప్రధాని మోదీ శాంతి మంత్రాన్ని ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు
ప్రతిరోజూ స్మార్ట్‌వాచ్ ధరిస్తున్నారా?ఆరోగ్య ప్రభావాలు, రేడియేషన్
ప్రతిరోజూ స్మార్ట్‌వాచ్ ధరిస్తున్నారా?ఆరోగ్య ప్రభావాలు, రేడియేషన్
25 కోట్లతో తీస్తే 320 కోట్లు.. OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్
25 కోట్లతో తీస్తే 320 కోట్లు.. OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్
ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!
ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?