AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tatvam Review: తత్వం మూవీ రివ్యూ.. ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?

ఓ సిచ్యువేషన్ వచ్చినపుడు మనిషి ఏది నిజమో..ఏది అబద్దమో తెలియని సందిగ్ధంలో ఉన్నపుడే ఓ మనిషి తత్వం బయటపడుతుంది. అలాంటి మర్డర్‌ మిస్టరీతో వచ్చిన సినిమానే తత్వం. హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Tatvam Review: తత్వం మూవీ రివ్యూ.. ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
Tatvam Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 6:34 AM

Share

మూవీ రివ్యూ: తత్వం

నటీనటులు: దినేష్త తేజ్, దష్విక.కె తదితరులు

ఎడిటర్‌: విప్లవ్‌ నైషధం

సినిమాటోగ్రఫీ: భరత్‌ పట్టి

సంగీతం: చేతన్ భరద్వాజ్

నిర్మాతలు: శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి

దర్శకుడు: అర్జున్ కోలా

కథ:

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ డ్యూటీ చేసే కళ్యాణ్ (దినేష్ తేజ్) సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే టైమ్‌లో పెళ్లి చూపుల నిమిత్తం రామాపురం ఊరికి వెళ్తాడు. అక్కడ సౌమ్య (దష్విక)ను చూసిన వెంటనే ఇష్టపడతాడు. అదే ఊళ్లో మూర్తి, నాగమణి అనే భార్యాభర్తలు వ్యవసాయం మీద బతుకుతుంటారు. వాళ్ల కొడుకు సుధ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అనుకోని పరిస్థితుల్లో ఆ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురవుతారు. మానసిక రోగి అయిన సుధనే వాళ్లను చంపాడని ఊరి జనాలు అతడిని కొడతారు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో, ఆ ఊరికి వచ్చిన కళ్యాణ్ చేతికి ఈ కేసు దర్యాప్తు వస్తుంది. అసలు ఆ భార్యాభర్తలను చంపిందెవరు, సుధ నిజంగానే హంతకుడా, ఈ మిస్టరీని కళ్యాణ్ ఎలా చేధించాడు, సౌమ్యతో అతడి పెళ్లి జరిగిందా అనేది ఈ మూవీ స్టోరీ.

కథనం:

ఈ చిత్రాన్ని కేవలం ఓ మామూలు మర్డర్ మిస్టరీలా కాకుండా, మనిషి ఆలోచనా విధానం, నమ్మకం, నిజానిజాలు లాంటి అంశాలను జోడించి కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అర్జున్ కోలా. ఒక పక్క మర్డర్ కేసు దర్యాప్తు సాగుతుండగానే, మరో పక్క తాత్విక కోణాన్ని టచ్ చేస్తూ సినిమాను నడిపించారు. ఒక వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేనంత మాత్రాన, పరిస్థితులను బట్టి అతడే నేరం చేశాడని గుడ్డిగా నమ్మేయడం కరెక్టేనా అనే పాయింట్‌ను సుధ క్యారెక్టర్ ద్వారా బలంగా చూపించారు. ఊరి జనాల అనుమానాలు, పోలీసుల ఎంక్వైరీ, అసలు నిజాన్ని రాబట్టేందుకు హీరో చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక పెద్ద కేసును డీల్ చేసే బాధ్యతాయుతమైన రోల్‌లో హీరో జర్నీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా కథకు బాగానే సింక్ అయింది. క్రైమ్ థ్రిల్లర్‌కు ఆధ్యాత్మికత, వేదాంతం లాంటివి మిక్స్ చేయడం మంచి ప్రయోగమే అయినా, ఇలాంటి కథలకు నెరేషన్ చాలా గ్రిప్పింగ్‌గా ఉండాలి. కానీ దర్శకుడు కొన్ని చోట్ల సాగదీతకు గురి చేశాడు. సీన్స్ చాలా నెమ్మదిగా సాగడం వల్ల ఆడియన్స్‌కు కాస్త బోర్ కొడుతుంది. క్లైమాక్స్ ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ రాసుకున్న తీరు బాగున్నా, కథనంలో స్పీడ్ పెంచి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.

నటీనటులు:

కానిస్టేబుల్ కళ్యాణ్ రోల్‌లో దినేష్ తేజ్ చాలా చక్కగా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కు మంచి డెప్త్ తీసుకొచ్చాడు. పల్లెటూరి అమ్మాయి సౌమ్యగా దష్విక తన క్యూట్ లుక్స్‌తో, క్యూట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. మెంటల్ కండిషన్ సరిగ్గా లేని సుధ పాత్ర చేసిన నటుడు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం:

మర్డర్ మిస్టరీకి కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో చేతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయింది. భరత్ భట్టి కెమెరా వర్క్ విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని, క్రైమ్ సీన్స్‌ను నేచురల్‌గా చూపించాయి. ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం కాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. ఈ విషయంలో ఎడిటర్ విప్లవ్ ఇంకాస్త ఫోకస్‌గా ఉండాల్సింది.. ముఖ్యంగా నెరేషన్‌లో వచ్చే ల్యాగ్ సీన్స్ కొన్ని ట్రిమ్ చేసుంటే బాగుండేది. దర్శకుడు అర్జున్ కోలా తీసుకున్న పాయింట్ బాగుంది కానీ, దాన్ని తెరపై ఎంగేజింగ్‌గా చూపించడంలో కొంత తడబడ్డాడు. శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద నీట్‌గా కనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా తత్వం.. మర్డర్ మిస్టరీ.. డిఫెరెంట్ ఎక్స్‌పీరియన్స్..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us