AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా..?

పుష్ప సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న పహాద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. బాలకృష్ణ ఫేమస్ డైలాగ్ తో వచ్చిన ఈ సినిమాలో రాజమౌళి బంధువు శశాంక్ ఏలేటి తెరకెక్కించాడు. ఎస్ ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా..?
Dont Trouble The Trouble Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 6:19 AM

Share

మూవీ రివ్యూ: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా, వెంకటేష్ కాకుమాను, సుబ్బరాజు, శశాంక్, మహేష్ మంజ్రేకర్ తదితరులు..

సమర్పకుడు: SS రాజమౌళి

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫి: బ్రాడ్ ఫ్రాన్సిస్

ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని

దర్శకత్వం: శశాంక్ యేలేటి

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ

కథ:

సూరి (ఫహద్ ఫాజిల్) ఒక అనాధ. తన ఫ్రెండ్ తో కలిసి ఉంటాడు. అంబులెన్స్ నడుపుతూనే బతకడానికి ఏవో చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. అలాంటి వాడి జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు దివ్య (సారా పాలేకర్) వస్తుంది. అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు సూరి. మరోవైపు దివ్య మాత్రం తాను తన అమ్మానాన్నలను మ్యాజిక్ చేసి మాయం చేసాను అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరి ట్రావెల్ నడుస్తున్న సమయంలోనే దివ్య మనిషి కాదు ఆత్మ అని తెలుసుకుంటాడు సూరి. ఆ అమ్మాయికి ఉన్న సూపర్ పవర్స్ కూడా వాడుకుంటాడు. అదే సమయంలో వాళ్ళ అమ్మానాన్నలను దివ్యతో కలిపిస్తానని మాటిస్తాడు. ఆ సమయంలో సూరికి ఎదురైన ఇబ్బందులు ఏంటి.. దివ్యకు ఏమైంది.. వాళ్ళ అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనేది మిగిలిన కథ..

కథనం:

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వినడానికి ఒక చందమామ కథలా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మల మారి ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుక్కోవడమే ఈ సినిమా కథ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన విషయం తనకు తెలియదు. ఒక చిన్న లింకు పెట్టి ఆ అమ్మాయి కేవలం హీరోకి మాత్రమే కనిపించేలా దర్శకుడు ఒక లాజిక్ రాసుకున్నాడు. అదేంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.. సినిమా మొదటి నుంచి ఆసక్తికరంగానే సాగుతుంది. మొదటి 15 నిమిషాలు హీరో ఎలాంటివాడు.. డబ్బుల కోసం ఎలా మారిపోతుంటాడు అనేది చాలా క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు శశాంక్. ఒకసారి కథలోకి వెళ్లిపోయిన తర్వాత అమ్మాయి కథలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకుంటుంది.. కాకపోతే అక్కడ రాసుకునే సన్నివేశాలు ఇంకాస్త వేగంగా ఉండుంటే బాగుండేది. అమ్మాయి మనిషి కాదు ఆత్మ అని హీరో తెలుసుకోవడానికి ఇంటర్వెల్ వరకు టైం తీసుకున్నాడు దర్శకుడు. అక్కడి నుంచి సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కూడా కథ కాస్త నెమ్మదిగానే వెళ్ళింది. అయితే చెప్పే ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్ గా చెప్పాలని ముందుగానే ఫిక్స్ అయిపోయిన దర్శకుడు టైం బాగానే తీసుకున్నాడు. కథలో మెయిన్ ప్లాట్ రివిల్ అయిన తర్వాత.. హీరోకు, ఆ పాపకు మధ్య ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా రాసుకోవడంలో తడబడినట్టు అనిపించింది. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండానే అప్పటివరకు ఆ పాప మీద ఎలాంటి ఫీలింగ్ లేని హీరో సడన్గా తనకోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత బలంగా నిలబడతాడు. ఇలాంటి సన్నివేశాలు రాసుకునేటప్పుడు దానికి ముందు మరికొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలు రాసుకుంటే సినిమా మరింత పకడ్బందీగా వచ్చేది. క్లైమాక్స్ పూర్తిగా ఎమోషనల్ గానే రాసుకున్నాడు దర్శకుడు శశాంక్. అప్పటివరకు సినిమా ఎలా ఉన్నా కూడా చివరి 15 నిమిషాలు మాత్రం ప్రాణంగా నిలిచింది. చివర్లో వచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. వీకెండ్ సరదాగా చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీతో ఒక సినిమా చూడాలి అనుకుంటే ఇది మంచి ఆప్షనే.

నటీనటులు:

ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు.. సూరి పాత్రలో మెప్పించాడు. ఒకవైపు కామెడీ పండిస్తూనే చివర్లో ఎమోషనల్ గా ఏడిపించే ప్రయత్నం చేశాడు. చిన్నారి దివ్య పాత్రలో సారా పాలేకర్ అద్భుతంగా నటించింది. కథ మొత్తం ఆ అమ్మాయి మీద వెళ్తుంది. మరొక కీలక పాత్రలో హీరో ఫ్రెండ్ గా వెంకటేష్ కాకమాను బాగా నటించాడు. సహాయక పాత్రలో సుబ్బరాజ్, మహేష్ మంజ్రేకర్, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచదేవ బాగా నటించారు. మరో కీలక పాత్రల్లో శశాంక్, విమలా రామన్ బాగున్నారు.

టెక్నికల్ టీం:

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు కాలభైరవ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇందులో పాటలు తక్కువగానే ఉన్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రవీణ్ ఆంథోనీ ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే రెండు గంటల 38 నిమిషాల డ్యూరేషన్ బాగా ఎక్కువైనట్టు అనిపించింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే ఇంకా షార్ప్ గా ఉండేది. బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. తొలి సినిమానే అయినా కూడా దర్శకుడు శశాంక్ ఏలేటి మంచి కథను తీసుకున్నాడు.. కాకపోతే దాన్ని మరింత పకడ్బందీగా చెప్పి ఉంటే ఇంకాస్త మంచి సినిమా అయ్యుండేది. కార్తికేయ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్ గా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఫాంటసీ డ్రామా..!

Follow Us
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?