AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2026 | 5:17 PM

Share

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కోసం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తాజాగా బయటకు వచ్చిన ఆయన కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బరువు తగ్గి మరింత స్టైలిష్‌గా కనిపించిన తారక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు.

భలే మారిపోయాడుగా.. ఎన్టీఆర్ న్యూ లుక్ చూసాక ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే. మా తారక్ ఏంటి ఇలా అయిపోయాడు అంటూ కొన్నాళ్ళ కింద ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు ఆయన లుక్ చూసి..! ప్రశాంత్ నీల్ సినిమా కోసం మేకోవర్ అయ్యే క్రమంలో మొహంలో గ్లో కూడా తగ్గిపోయింది. కానీ ఇప్పుడన్నీ మారాయి.. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్‌తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మరి ఆయనెలా ఉన్నారో తెలుసా..? NTR న్యూ లుక్ అదిరిపోతుంది.. ఒకప్పట్లా రెగ్యులర్‌గా ఆయన బయటికి రావట్లేదు కానీ అప్పుడప్పుడూ చూస్తున్న లుక్స్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. డ్రాగన్ కోసం బాగా మేకోవర్ అవుతున్నారన్నారు. అయితే టీజర్‌లో తారక్ లుక్ చూసి అభిమానులు కాస్త నిరాశ పడ్డారు.. సిక్స్ ప్యాక్ ఎఫెక్ట్‌తో ఫేస్‌లో గ్లో పోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. కొన్నాళ్లుగా నీల్ సినిమా కోసం బాగా చెమటోడుస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం ఎంతగా అంటే.. ఉంటే సెట్‌లో లేదంటే జిమ్‌లో వర్కవుట్స్ అన్నట్లు మారిపోయారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా తారక్ లుక్ బయటికొచ్చింది. అది చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అఖిల్ లెనిన్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు తారక్..! అఖిల్‌ను కలిసిన ఫోటోల్లో తారక్ మొహంలో ఆ మార్పు కనిపించింది.. మునపటి గ్లో మళ్లీ వచ్చింది.. పైగా గతంతో పోలిస్తే చాలా సన్నగా మారి ఇంకాస్త స్టైలిష్‌గా మారారు తారక్. ఆ మధ్య బెంగళూరులో హాస్పిటల్ ఓపెనింగ్‌కు వచ్చినప్పటి కంటే ఇంకా బరువు తగ్గారిప్పుడు ఎన్టీఆర్..! చూస్తుంటే తన లుక్‌పై వచ్చిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్నారని అర్థమవుతుంది. మామూలుగా తన హీరోలను పెద్దగా స్టైలిష్‌గా ఏం చూపించరు నీల్.. నల్లగా బొగ్గు పూసి చూపిస్తుంటారు. కానీ తారక్‌ను మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న డ్రాగన్‌లో మాఫియా డాన్‌గా తారక్ నటిస్తున్నారు. గతంలో బాద్షాలో డాన్‌గా కనిపించిన ఎన్టీఆర్.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ తరహా పాత్రలోనే కనిపించబోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

మొబైల్‌ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్‌

Published on: Jul 09, 2026 05:16 PM
Follow Us