రాజస్థాన్లోని జైపూర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి కోసం కన్న కూతురే తల్లిని కిరాయి హంతకులతో హత్య చేయించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నీరజ్ శర్మ అనే మహిళను స్కార్పియో ఢీకొట్టి చనిపోగా, పోలీసుల దర్యాప్తులో ఆమె కూతురు ఆయుషి పైన అనుమానం వచ్చింది. ఈ కేసులో ఏడుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.