AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty tips: చలికాలంలో అందమైన చర్మం కోసం సింపుల్‌ టిప్స్‌.. ఇలా చేశారంటే.. మెరిసిపోతారంతే..!

శీతాకాలంలో చల్లని గాలుల కారణంగా శరీరంలో తేమను పీల్చి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. దీనిని నుంచి తప్పించుకోవడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అయితే, అవన్నీ కొంతకాలం తర్వాత మీ చర్మాన్ని మరింత నల్లగా మార్చి డ్యామేజ్‌ చేసే అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని సహాజ ఇంటి నివారణలు ఉపయోగిస్తే.. మీ చర్మం రంగు చలికాలంలోనూ కాంతివంతంగా ఉంటుంది.. అదేలాగో ఇక్కడ చూద్దాం..

Beauty tips: చలికాలంలో అందమైన చర్మం కోసం సింపుల్‌ టిప్స్‌.. ఇలా చేశారంటే.. మెరిసిపోతారంతే..!
Beauty Tips
Jyothi Gadda
|

Updated on: Nov 19, 2025 | 9:34 PM

Share

సాధారణంగానే చలికాలం రాగానే చర్మం పగిలి రంగు మారుతుంది. కాళ్లు చేతులు నల్లగా అవుతుంటాయి. పెదాలు పగిలిపోతుంటాయి. ముఖం నీరసంగా, మసకబారినట్లుగా కనిపిస్తుంది. చల్లని గాలుల కారణంగా శరీరంలో తేమను పీల్చి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. దీనిని నుంచి తప్పించుకోవడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అయితే, అవన్నీ కొంతకాలం తర్వాత మీ చర్మాన్ని మరింత నల్లగా మార్చి డ్యామేజ్‌ చేసే అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని సహాజ ఇంటి నివారణలు ఉపయోగిస్తే.. మీ చర్మం రంగు చలికాలంలోనూ కాంతివంతంగా ఉంటుంది.. అదేలాగో ఇక్కడ చూద్దాం..

టమాటా రసం: టమాటా రసం కూడా సౌందర్యసాధనంగా పనిచేస్తుంది. ముఖం రంగును మెరుగుపరచడంలో టమాటా రసం మ్యాజిక్‌లా పనిచేస్తుంది. ఈ రసం పొడి చర్మం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. టమాటా రసం తయారు చేయడానికి ముందుగా టమాటాలను తురిమి దాని రసాన్ని తీయాలి. ఆ తరువాత ఈ రసాన్నివేళ్లు లేదా దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. టమోటాలలో ఉన్న విటమిన్ సి చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది.

బంగాళాదుంప రసం: బంగాళాదుంపలు ప్రతి ఇంట్లో తప్పక అందుబాటులో ఉంటాయి. బంగాళదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మంలో ఉన్న నలుపుదనం తొలగిపోతుంది. దీని కోసం ముందుగా బంగాళాదుంపను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దాని నుంచి రసాన్ని తీయాలి. ఆ తర్వాత,ఈ రసాన్ని కాటన్ తో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

ఇవి కూడా చదవండి

ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టిని ఫేస్‌ ప్యాక్‌ తో ముఖం రంగును మెరుగుపరచుకోవచ్చు. ఈ ప్యాక్‌ చర్మం మీద నలుపుదనాన్ని ఇట్టే తొలగిస్తుంది. ముల్తానీ మట్టిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ సెప్టిక్,యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ముల్తానీ మిట్టితో ఫేస్‌ ప్యాక్‌ తయారు చేయడానికి ఒక గిన్నెలో 4 టీస్పూన్ల ముల్తానీ మట్టి,2 టీస్పూన్ల నిమ్మరసం, 4 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ గ్లిజరిన్ వేసి పేస్టు తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఆ తరువాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది వారానికి రెండు సార్లు చేయడం ద్వారా చర్మం మెరుస్తూ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!