AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 సంవత్సరాలుగా ఒకే నంబర్ వాడుతున్నారా..? అది మీ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది..!

మీరు 5 సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. ! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియో మీ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది..! సంవత్సరాలుగా ఒకే నంబర్ వాడుతున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పే షాకింగ్‌ విషయాలు వెల్లడించింది ఈ వీడియో. మీలో ఎవరైనా గత ఐదు సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తుంటే మీరు ఎలాంటి వ్యక్తి అన్నది ఇక్కడ తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే..

5 సంవత్సరాలుగా ఒకే నంబర్ వాడుతున్నారా..? అది మీ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది..!
Same Number For Years
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 3:15 PM

Share

మీ మొబైల్ నంబర్ ఎంత పాతది? మనం ప్రతిరోజూ కాల్స్‌కి సమాధానం ఇవ్వడానికి, OTP లను స్వీకరించడానికి, WhatsApp వాడకానికి ఉపయోగించే మొబైల్ నంబర్ మన వ్యక్తిత్వం గురించి ఏదైనా వెల్లడించగలదా అని ఊహించుకోండి..? సోషల్ మీడియాలో వైరల్ అయిన 31 సెకన్ల రీల్ అదే చెబుతోంది. ఆశ్చర్యకరంగా, వీడియో చూస్తున్న లక్షలాది మంది ప్రజలు తాము దీనికి సరిగ్గా సరిపోతున్నామని అంటున్నారు. అందుకే ఈ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా, వారి మొబైల్ నంబర్లతో అనుబంధించబడిన వారి స్వంత జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తోంది. ఈ వీడియో ప్రయాణిస్తున్న కారు లోపల నుండి తీశారు. కారు రోడ్డుపై ప్రశాంతంగా వెళ్తోంది. ముందు ట్రాఫిక్ కనిపిస్తుంది. అయితే, ఈ వీడియోకి క్యాప్షన్‌గా 5 సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్…5 వాస్తవాలు అని రాసి ఉంది..దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా చెబుతోంది, మీరు గత ఐదేళ్లుగా ఒకే నంబర్ (మొబైల్ నంబర్ వ్యక్తిత్వం) ఉపయోగిస్తున్నట్లయితే అది మీ గురించి 5 విషయాలను చెబుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి.

వైరల్ వీడియో ఏం చెబుతోంది?

ఇవి కూడా చదవండి

– మీరు రుణగ్రహీత కాదు.. మీకు ఎటువంటి అప్పులు, బాకాయిలు లేవని అర్థం.

– మీరు సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ చేసుకోవాలని అనుకోరు. సంబంధాలను మీరు ఎంతో గౌరవిస్తారు.

– మీరు నిజాయితీపరులు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిజాయితీని రాజీ పడరు. మోసం చేయాలని ఎప్పుడూ అనుకోరు.

– మీపై ఎటువంటి కోర్టు లేదా పోలీసు కేసు, ఎటువంటి ఆరోపణలు లేవు.

– నువ్వు సమస్య సృష్టించేవాడివి కాదు, సమాజంలో నీకు మంచి పేరు ఉంది. మీరు బాధ్యతాయుతమైన, నమ్మదగిన వ్యక్తి.

ఈ ఐదు విషయాలు వినగానే ప్రతి ఒక్కరికీ తమ తమ జ్ఞాపకాలు రిఫ్రెష్ అయ్యాయి. ఈ విషయాలు చాలా అర్థమయ్యేలా ఉన్నాయని ప్రజలు భావించారు. వారు తమ సొంత మొబైల్ చరిత్రను కామెంట్‌ బాక్స్‌లో నెటిజన్లతో షేర్‌ చేసుకుంటున్నారు. ఈ వీడియోను ఏప్రిల్ 20న @aksh_44 ద్వారా Xలో పోస్ట్ చేశారు. ఇప్పటికే 1.8 లక్షలకు పైగా వ్యూస్‌, 37 వేల లైక్‌లు వచ్చాయి.

వీడియో ఇక్కడ చూడండి..

వీడియో చూసినప్రతి ఒక్కరూ స్పందించారు. ఒకరు ఇలా రాశారు. నాకు 15 సంవత్సరాలుగా ఒకే నంబర్ ఉంది… 12వ తరగతిలో నాన్న దీన్ని నాకు ఇచ్చాడు. మరొకరు ఇలా అన్నారు. నాకు 21 సంవత్సరాలుగా ఒకే నంబర్ ఉంది. దానిని ఎప్పుడూ మార్చలేదు. కొందరు 10 సంవత్సరాలు, కొందరు 5–15 సంవత్సరాలు అని అన్నారు… అంటే, ప్రజల మొబైల్ నంబర్ కథలు నాస్టాల్జిక్ డైరీల కంటే తక్కువ కాదు. ఒక నంబర్ ఒక వ్యక్తి అలవాట్లు, స్థిరత్వం, బాధ్యతను వెల్లడిస్తుందని మీరు నమ్ముతున్నారా? లేదా ఇది సోషల్ మీడియా సరదా తర్కమా? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తున్నారో గుర్తు చేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..