AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఎండకు కందిపోయే ఫోన్ కవర్.. అచ్చం మనలాగే..! సోషల్ మీడియాలో హల్‌చల్‌

సోషల్ మీడియా అంటేనే ఫుల్లు టైమ్‌పాస్‌..ఎందుకంటే.. ఇక్కడ ఎన్నో రకాల వింతలు, విశేషాలు, ఆలోచనాత్మక వార్తలు, కథనాలు, వైరల్‌ వీడియోలకు అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌ సోషల్ మీడియా. ఇక్కడ ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక వింత ఫోన్ కవర్ హల్ చల్ చేస్తోంది... ఇది అచ్చం మనిషి చర్మంలా కనిపిస్తుంది. అంతేకాదు.. మనిషిలాగే, అనుభూతి చెందుతుంది. అది ఎండలో ఎర్రగా మారుతుంది. ఎలాగంటే.. సూర్యరశ్మి వల్ల చర్మం కందిపోయినట్లుగా మారుతుంది. అదేలాగో ఇక్కడ చూద్దాం...

Watch: ఎండకు కందిపోయే ఫోన్ కవర్.. అచ్చం మనలాగే..! సోషల్ మీడియాలో హల్‌చల్‌
Phone Case Feels Like Human Skin
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 4:15 PM

Share

టెక్నాలజీ మిమ్మల్ని కనెక్ట్ చేయగలదంటే మీరు నమ్ముతారా..? నమ్మకం లేదంటే ఈ వార్త మీ కోసమే… సూర్యుని పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడమే కాకుండా, మనిషి చర్మంలా కనిపించే, అనుభూతి చెందే ఒక కొత్త, ప్రత్యేకమైన నమూనా బయటకు వచ్చింది. ఫ్రెంచ్ పరిశోధకుడు మార్క్ టెస్సియర్, UK కంపెనీ వర్జిన్ మీడియా O2 సంయుక్తంగా స్కిన్‌కేస్ అనే ప్రత్యేకమైన మొబైల్ కేస్‌ను రూపొందించారు. ఇది నిజంగానే పూర్తిగా మనిషి చర్మాన్ని పోలి ఉంది. ఈ మొబైల్ కేస్‌ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ వేదికగా సంచలనం సృష్టించింది.

ఈ సింథటిక్ కవర్ మనిషి చర్మంలాగానే కనిపిస్తుంది. అనుభూతి చెందుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఇది మన చర్మం లాగానే UV కాంతిలో కాలిపోయినట్లుగా రంగును మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. సెలవు దినాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లను పదే పదే వాడుతుంటారు. కానీ, సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మర్చిపోతారని పరిశోధనలో వెల్లడైంది. ఈ అలవాటును ఎదుర్కోవడానికి స్కిన్‌కేస్ సృష్టించబడింది. తద్వారా వినియోగదారులు UV కిరణాలు ఎంత హానికరమో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. సాంకేతికత, ఆరోగ్యంతో ముడిపడిన ప్రత్యేకమైన కలయిక ఈ స్కిన్‌ కేస్‌.

ఇవి కూడా చదవండి

టెస్సియర్ ఈ కేస్‌ను సిలికాన్, UV-రియాక్టివ్ సమ్మేళనంతో సృష్టించింది. 3D ప్రింటింగ్, చేతితో చెక్కే పద్ధతులను ఉపయోగించి చర్మం  కూడా కేస్‌లో రూపొందించారు. ఇది నిజంగా మనిషి చర్మంలాగే కనిపిస్తుంది. ఈ కేస్ మూడు వేర్వేరు స్కిన్ టోన్లలో తయారు చేయబడింది. వీటిలో ప్రతి ఒక్కటి UV కిరణాలకు భిన్నంగా స్పందిస్తాయి.

వీడియో ఇక్కడ చూడండి..

వర్జిన్ మీడియా O2 చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్ హిండెన్‌బాచ్ మాట్లాడుతూ, ముఖ్యంగా హాలీడేస్‌ టైమ్‌లో మొబైల్ ఫోన్లు మన జీవితాల్లో భాగమయ్యాయి. స్కిన్‌కేస్ ద్వారా వడదెబ్బ ఎంత ప్రమాదకరమో ప్రజలకు అర్థమయ్యేలా చూపిస్తుందని చెప్పార. అయితే, ఈ కవర్ కేవలం ఒక నమూనా మాత్రమే. అమ్మకానికి ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పారు. కానీ, సోషల్ మీడియాలో దాని ఫోటోలు, వీడియోలు మాత్రం ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..