AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే..

సాధారణంగా ఒక పెంపుడు జంతువు ధర ఎంత ఉంటుంది? కొన్ని వేలు.. మహా అయితే కొన్ని లక్షలు.. కానీ ఒక కోతి ధర ఏకంగా 132 కోట్ల రూపాయలు అంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన కార్ల కంటే ఎక్కువ ధర పలికే మూగజీవాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అరుదైన జన్యువులు, అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఆ జంతువుల గురించి తెలుసుకుందాం..

కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే..
Most Expensive Animals In The World
Krishna S
|

Updated on: Mar 19, 2026 | 12:13 PM

Share

సాధారణంగా పెంపుడు జంతువులంటే కొన్ని వేలల్లో లేదా లక్షల్లో ఉంటాయని మనకు తెలుసు. కానీ కొన్ని జంతువుల ధర వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అద్భుతమైన జన్యువులు, అరుదైన రంగులు, ఔషధ గుణాల వల్ల ఇవి విలాసవంతమైన కార్లు, బంగళాల కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన జంతువుగా గ్రీన్ మంకీ రికార్డు సృష్టించింది. దీని పేరు ఆకుపచ్చ కోతి అయినప్పటికీ.. ఇది చూడటానికి అలా ఉండదు. దీనికి ఉన్న అరుదైన ఔషధ గుణాల కారణంగా ఒక వేలంలో దీని ధర ఏకంగా రూ. 132 కోట్లు పలికింది. గుర్రపు పందాల్లో వాడే అత్యున్నత జాతి గుర్రాల కంటే కూడా దీనికి ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం.

మిస్సీ.. రూ. 10 కోట్ల ఆవు

కెనడాకు చెందిన మిస్సీ అనే ఆవు సుమారు రూ.10 కోట్లకు అమ్ముడైంది. ఇంత ధర పలకడానికి దీని జన్యువులే ప్రధాన కారణం. ఈ జాతి ఆవులు అత్యధికంగా పాలు ఇస్తాయని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. పాల దిగుబడిని పెంచాలనుకునే వారు ఈ రకమైన జన్యువులున్న ఆవుల కోసం కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడరు.

టిబెటన్ మాస్టిఫ్.. సంపన్నుల స్టేటస్ సింబల్

సింహం లాంటి జూలు, భారీ శరీరంతో ఉండే టిబెటన్ మాస్టిఫ్ కుక్కలకు చైనా వంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఈ జాతి కుక్క ఏకంగా రూ.12 కోట్లకు అమ్ముడైంది. వీటిని పెంచుకోవడాన్ని అత్యంత సంపన్నులు తమ హోదాకు చిహ్నంగా భావిస్తారు.

తెల్ల సింహాలు – సవన్నా పిల్లులు

తెల్ల సింహాలు అడవుల్లో సహజంగా దొరకవు, జన్యుపరమైన మార్పుల వల్ల ఇవి తెల్లని రంగును పొందుతాయి. ఒక జత తెల్ల సింహాల విలువ రూ.కోటి పైమాటే. సవన్నా పిల్లి: పిల్లి జాతుల్లో అత్యంత ఖరీదైనది సవన్నా పిల్లి. దీని రూపం, చురుకుదనం వల్ల దీని విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

అయమ్ సెమానీ.. నల్లటి కోడి ధర లక్షల్లో

ఇండోనేషియాకు చెందిన అయమ్ సెమానీ కోళ్లు తల నుండి కాళ్ల వరకు, చివరికి వాటి మాంసం కూడా నల్లగానే ఉంటుంది. వీటి జన్యువుల్లోని ప్రత్యేకత, ఔషధ గుణాల వల్ల ఒక్కో కోడిని రూ.2 నుండి 3 లక్షలకు విక్రయిస్తారు.

ప్రకృతిలోని వైవిధ్యం, జన్యువుల మాయాజాలం ఈ మూగజీవాలను ఇంత విలువైనవిగా మారుస్తున్నాయి. విలాసం కోసం కొందరు, వ్యాపారం కోసం మరికొందరు వీటిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు.

Follow Us