AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Leaves: చలికాలంలో వాము ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Ajwain Leaves: చలికాలంలో వాము ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!
Ajwain Leaves
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2025 | 8:06 PM

Share

ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ మొక్కలు, మూలికలు అనేకం ఉన్నాయి. కానీ, మనం వాటిని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తుంటాం. అలాంటి వాటిల్లో వాము ఆకు ఒకటి. ఈ ఆకు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. ఈ ఆకు తింటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ ఆకుతో అధిక రక్తపోటు సైతం నియంత్రణలోకి వస్తుంది.ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు వాము ఆకులని తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత దూరమవుతుంది. మహిళల్లో ఎదురయ్యే పీరియడ్స్ నొప్పిని తగ్గించటంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. వీటిని తింటే పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పి తగ్గుతుందని అంటున్నారు. వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. వాము ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది. కావిటీస్, నోటి దుర్వాసన, ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వాము ఆకు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ రెండు ఆకులు నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.ఈ ఆకులు తరచూగా తింటే శరీరం నుండి ట్యాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.. అందుకోసం వాము ఆకులని తేనె, వెనిగర్‌తో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..దీంతో కిడ్నీల్లో రాళ్ళ సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. వాము ఆకు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ రెండు ఆకులు నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..