Ambani School Fees: బాలీవుడ్ స్టార్ల పిల్లలు చదువుకునే అంబానీ స్కూల్‌లో ఫీజులు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!
Ambani School Fees: ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్), CAIE (కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) వంటి అనేక..

Ambani School Fees: ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి కుటుంబం నిర్వహించే విద్యాసంస్థ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS). ఇది ముంబైలో ఉంది. ఈ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) 2003లో నీతా అంబానీచే స్థాపించారు. ఈ పాఠశాల సమగ్ర విద్య, పిల్లల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది.
ముఖేష్ అంబానీ-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ DAIS వైస్-ఛైర్‌పర్సన్. ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ తండ్రి పేరు మీదుగా ఈ పాఠశాలకు పేరు పెట్టారు.
ఇది కూడా చదవండి: Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?
పాఠశాల విద్యార్థులకు ఏ పాఠ్యాంశాలను అందిస్తుంది?
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్), CAIE (కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) వంటి అనేక అంశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుంది. అలాగే ICSE (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), IGCSE (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కోసం విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ పాఠశాల పిల్లలను బాధ్యతాయుతమైన, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యా నైపుణ్యంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి విలువనిస్తుంది. అలాగే ప్రోత్సహిస్తుంది.
DAISలో వివిధ గ్రేడ్‌లకు వార్షిక రుసుము ఎంత?
11, 12 తరగతులకు ఈ పాఠశాల IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) ద్వారా IB డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందించడానికి అనుమతి పొందింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 1,087 మంది విద్యార్థులతో కూడిన విద్యార్థి సంఘం భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పాఠశాలలో 187 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 27 మంది ప్రవాసులు ఉన్నారు.
తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్, అబ్రామ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్ల పిల్లలు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)లో విద్యనభ్యసిస్తున్నారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కరీనా కపూర్, సైఫ్ అలీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసేందుకు తరచుగా పాఠశాలకు వచ్చే వార్షిక వేడుకలో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: Indian Railways: భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే 10 రైల్వే స్టేషన్లు ఇవే!
2023-2024 విద్యా సంవత్సరానికి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒక పిల్లాడిని చదివించాలంటే ఫీజులు కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు సుమారు రూ.1,400,000 నుండి రూ. 2,000,000 వరకు ఉంటాయని మీడియా సంస్థల ద్వారా సమాచారం. పాఠశాల ఫీజులలో పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలు, రవాణా, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
మీడియా నివేదికల ప్రకారం, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు గ్రేడ్ స్థాయి ఆధారంగా మారుతుంది. కిండర్ గార్టెన్ నుండి 7వ తరగతి వరకు ఫీజులు సంవత్సరానికి రూ. 1.70 లక్షలు లేదా నెలకు సగటున రూ. 14,000 అని నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత తరగతులకు ఫీజు పెరుగుతూ ఉంటుంది. అలాగే 8 నుండి 10 తరగతులకు సంవత్సరానికి రూ. 5.9 లక్షలు, 11, 12 తరగతులకు ఏటా రూ. 9.65 లక్షలు ఖర్చవుతుంది.
ఇది కూడా చదవండి: Tejas Fighter Jet Price: దుబాయ్‌లో కూలిపోయిన భారత్ తేజస్ ఫైటర్ జెట్ ధర ఎంతో తెలుసా? దానికి బీమా ఉంటుందా?
పైన పేర్కొన్న గణాంకాలు మీడియా నివేదికల నుండి మాత్రమే అందించాము. ఖచ్చితమైన, ధృవీకరించబడిన సమాచారాన్ని తనిఖీ చేయడానికి పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను నేరుగా సంప్రదించాలని సిఫార్సు చేస్తున్నాము.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








