సిద్దిపేట జిల్లా రఘోత్తంపల్లి గ్రామంలో శివాని శ్రీకాంత్ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు. ఆమె భర్త శ్రీనివాస్, భార్యను గెలిపిస్తే ఐదేళ్ల పాటు వార్డులోని మగవారికి ఉచిత కటింగ్, షేవింగ్ చేస్తానని ప్రకటించారు. వెనుకబడిన వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు, అందరినీ సమానంగా చూడాలనేది ఆయన లక్ష్యం. ఈ ఆఫర్ స్థానికంగా చర్చనీయాంశమైంది.