AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10కు ఆడిషన్ వీడియో పంపలేదా? మరో గోల్డెన్ ఛాన్స్.. జస్ట్ ఇలా చేస్తే చాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సామాన్యుల కోసం అగ్ని పరీక్ష కాంటెస్ట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆడిషన్స్‌ కూడా స్వీకరించారు. అయితే శనివారం (జూన్ 20)తోనే ఆడిషన్స్ వీడియో పంపాల్సిన గడువు ముగిసింది. ఇదే క్రమంలో ఇంట్రెస్ట్ ఉన్నా వివిధ కారణాల వల్ల చాలా మంది ఆడిషన్లు పంపలేకపోయారు.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10కు ఆడిషన్ వీడియో పంపలేదా? మరో గోల్డెన్ ఛాన్స్.. జస్ట్ ఇలా చేస్తే చాలు
Bigg Boss Telugu 10 Agnipariksha
Basha Shek
|

Updated on: Jun 22, 2026 | 5:57 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే షురూ కానుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్ట్ ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ పదో సీజన్ స్టార్ట్ అవుతుంది. గత సీజన్ లాగే ఈసారి కూడా సెలబ్రిటీలతో సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం అగ్ని పరీక్ష కాంటెస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆడిషన్స్ కూడా స్వీకరించారు. అయితే శనివారం (జూన్ 20)తోనే ఆడిషన్స్ వీడియో పంపాల్సిన గడువు ముగిసిపోయింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా వివిధ కారణాల వల్ల చాలా మంది ఆడిషన్లు పంపలేకపోయారు. అలాంటి వారి కోసం బిగ్ బాస్ టీమ్ మరో గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. యాంకర్ శ్రీముఖితో కూడిన ఓ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం ఆడిషన్స్ పంపేందుకు మరో ఛాన్స్ ఇస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోండని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

ఏం చేయాలంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడిషన్లు పంపాలనుకునే వాళ్లు ముందుగా whitegold.money/aptelugu అనే వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. అప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిపై బిగ్ బాస్ అగ్ని పరీక్ష లోగోతో పాటు శ్రీముఖి ఫొటో కూడా ఉంటుంది. ముందుగా మీ టాలెంట్ గురించి క్లియర్ గా అర్థమయ్యేలా తెలుగులో ఓ ఆడిషన్ వీడియోను రికార్డు చేయాలి. ఆ వీడియోను మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయాలి. ఈ పోస్టుకు @whitegold.telugu అనే పేజీని ట్యాగ్ చేయడంతో పాటు ఫాలో కొట్టాలి. చివరగా whitegold.money/aptelugu ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇందులో పేరు, డేటాఫ్ బర్త్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, జెండర్, అడ్రస్, ఏజ్, ఆడిషన్ వీడియో సోషల్ మీడియా లింక్స్ వివరాలు పొందుపరచాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. బిగ్ బాస్ నిర్వాహకులు మీ ప్రొఫైల్, అలాగే ఆడిషన్ వీడియోను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇదిగో వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us