AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: నాగశౌర్య సొంత మేనత్త తెలుగులో ఫేమస్ నటి అని మీకు తెలుసా? ఇద్దరికీ మాటల్లేవ్.. కారణమిదే

'ఛలో' సినిమాతో క్రేజీ హీరోల లిస్టులో చేరిపోయాడు నాగ శౌర్య . కల్యాణ వైభోగమే, జో అచ్చుతానంద వంటి ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ట్యాగ్ తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అయితే ఇప్పుడీ హ్యాండ్సమ్ హీరో ఓ సాలిడ్ హిట్ కోసం గట్టిగా ఎదురు చూస్తున్నాడు.

Naga Shaurya: నాగశౌర్య సొంత మేనత్త  తెలుగులో ఫేమస్ నటి అని మీకు తెలుసా? ఇద్దరికీ మాటల్లేవ్.. కారణమిదే
Naga Shaurya
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 7:09 PM

Share

నాగశౌర్య.. తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని పేరు. ఛలో సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అంతకు ముందు ఊహసలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, కల్యాణ వైభోగమే, జో అచ్చుతానంద, ఒక మనసు వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగులో లవర్ బాయ్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా ఈ హీరోకు సాలిడ్ హిట్ పడడం లేదు. వరుడు కావలేను, అశ్వధ్ధామ, కృష్ణ విందా విహారి, రంగబలి రీసెంట్ గా బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాలు నాగశౌర్యకు నిరాశనే మిగిల్చాయి. దీంతో సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. సినిమాల సంగతి పక్క న పెడితే.. నాగశౌర్యది సినిమా నేపథ్యమున్న కుటుంబమే. నాగశార్య సొంత మేనత్త(తండ్రి సోదరి) తెలుగులో ఫేమస్ నటి అని చాలా మందికి తెలియదు. చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన ఆమె సుమారు 70కు పైగా సినిమాలు చేశారు. హీరోయిన్ గా కాకపోయినా హీరోలకు చెల్లి పాత్రలతో ఆమె బాగా ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? లతాశ్రీ. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెల్లెలు అంటే చాలా మంది ఇట్టే గుర్తు పడతారు.

విజయవాడకు చెందిన లతా శ్రీ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. సహాయక నటిగా, విలన్ గా ఆడియెన్స్ ను అలరించింది. యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, ముద్దుల మేనల్లుడు, అబ్బాయి గారు, పోలీస్ భార్య, ఇంద్ర భవనం, దీపావళి, అల్లరోడు, దొరబాబు, బాల చంద్రుడు వంటి సినిమాల్లో లతా శ్రీ పోషించిన పాత్రలు బాగా గుర్తుంఇపోతాయి. అప్పట్లో టాలీవుడ్ లో ఈమెను చిట్టి చెల్లలు అని పిలిచే వారు. ఎందుకంటే అప్పట్లో చాలా మంది స్టార్ హీరోలకు ఈమెనే చెల్లెలుగా చేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 70 కిపైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి 1999 తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. 2007లో ఈవీవీ సత్యనారాయణ- అల్లరి నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అత్తిలి సత్తిబాబు’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించినా ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి దూరమైపోయింది.

లతా శ్రీ ఒక జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇద్దరూ బీటెక్ చదువుతున్నట్లు సమాచారం. కాగా తన మేనల్లుడు నాగశౌర్య అంటే తనకు ఇష్టమేనని ఒక సందర్భంలో చెప్పుకొచ్చిన లతా శ్రీ ఆ ఫ్యామిలీతో తమకు మాటల్లేవని పేర్కొనడం గమనార్హం. అన్నయ్య, మేనల్లుడు నా వాళ్లే.. కాని వదిన మన వాళ్లు అవ్వరు కదా అని లతా శ్రీ నాగశౌర్య తల్లితో ఉన్న విభేదాలను చెప్పకనే చెప్పారు. నాగశౌర్య ఇంట జరిగిన ఏ శుభకార్యంలోనూ ఈ ననటి కనిపించకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి
Senior Actress Latha Sri

Senior Actress Latha Sri

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us