AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా.. అసలు కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..

బరువు తగ్గాలా? అయితే అన్నం తినడం మానేస్తే సరిపోతుందా? డైటింగ్ మాత్రమే చేస్తే సన్నబడిపోవచ్చని అనుకుంటున్నారా?.. ఈ ఆలోచనతోనే చాలామంది సగం కడుపుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే కేవలం ఆహారం తగ్గించడమే బరువు తగ్గడానికి ఏకైక మార్గం అనుకుంటే పొరపాటేనని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గీతిక చోప్రా హెచ్చరిస్తున్నారు.

తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా.. అసలు కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Can You Lose Weight Just By Dieting
Krishna S
|

Updated on: Jul 28, 2026 | 7:47 AM

Share

బరువు తగ్గడానికి చాలామంది ఎంచుకునే ఏకైక మార్గం డైటింగ్. ఆహారం తగ్గించేస్తే చాలు సులభంగా బరువు తగ్గిపోవచ్చని భావిస్తారు. అయితే ఇది నిజమేనా? అంటే కాదనే చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గీతిక చోప్రా. కేవలం డైటింగ్ ద్వారా ప్రారంభంలో బరువు తగ్గినట్లు కనిపించినప్పటికీ, సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది సరిపోదని ఆమె స్పష్టం చేస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం.. బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం మాత్రమే కాదు. ఇది శరీరం మెటబాలిజం, హార్మోన్లు, కండరాల పరిమాణం , నిద్ర, మానసిక ఒత్తిడి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, శారీరక శ్రమ వంటి అన్ని అంశాల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రోటీన్ ఆహారం తీసుకోవడం తగ్గించి, వ్యాయామం చేయకుండా కేవలం డైటింగ్ మాత్రమే చేస్తే.. కొవ్వుతో పాటు కండరాలు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల బాడీ మెటబాలిజం మందగించి, భవిష్యత్తులో బరువు మళ్లీ వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.

డైటింగ్‌తో పాటు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు..

కేలరీల లోటు పాటించడం మంచిదే కానీ క్రాష్ డైటింగ్ అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థిరమైన ఫలితాల కోసం వీటిపై దృష్టి పెట్టాలి..

ప్రోటీన్ ఆహారం: మీరు తీసుకునే ప్రతి పూట భోజనంలోనూ నాణ్యమైన ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.

స్ట్రెంగ్త్ ట్రైనింగ్: వారంలో కనీసం 2 నుండి 4 రోజులు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి.

రోజువారీ నడక: రోజూ 7,000 నుండి 10,000 అడుగులు నడవాలి.

గాఢమైన నిద్ర: ప్రతిరోజు 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.

ఒత్తిడి నివారణ: మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.

జీర్ణవ్యవస్థ – మెటబాలిజం

మన మొదటి లక్ష్యం కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు. కడుపులో మంట,వాపును తగ్గించి, మెటబాలిజంను మెరుగుపరచడం. జీర్ణవ్యవస్థలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అవి జీర్ణక్రియను, ఇన్సులిన్ నిరోధకతను, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదానికి కూడా దారితీస్తుంది. అందుకే శరీరానికి సరిపడే పోషకాహారం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం.

నిపుణులు సూచించే సక్సెస్ ఫార్ములా..

  • శాశ్వతంగా, ఆరోగ్యకరమైన రీతిలో ఫిట్‌గా ఉండటానికి డాక్టర్ గీతిక చోప్రా సూచిస్తున్న ఫార్ములా ఇది..
  • సమతుల్య ఆహారం + ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ+ సరైన ప్రోటీన్..
  • ఈ సమగ్ర విధానాన్ని పాటించినప్పుడే బరువు తగ్గడమే కాకుండా, శరీర అంతర్గత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

Follow Us