July 26, 2026
Subhash
గుండెపోటు ప్రధాన లక్షణాలలో చాతి నొప్పు ఒకటి. చాతి మధ్యలో ఏదో నొక్కినట్లు, బిగుతుగా లేదా భారం వేసినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నొప్పి కేవలం చాతిలోనే కాకుండా భుజాలు, వీపు, మెడ, దవడలు లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది. ఇలాంటి నొప్పి పదే పదే వస్తుంటే తేలికగా తీసుకోకండి.
చిన్న చిన్న పనులు చేసినా లేదా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఆయాసంగా అనిపిస్తే గుండె నుండి సంకేతం కావొచ్చు. చాతిలో నొప్పి లేకపోయినా కూడా ఊపిరాడకపోవడం జరగవచ్చు.
ఎండ లేదా వేడి లేకపోయినా, విశ్రాంతిగా ఉన్న సమయంలో అకారణంగా చల్లని చెమటలు పడుతుంటే అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
సరిపడా నిద్ర ఉన్నప్పటికీ విపరీతమైన అలసటగా అనిపించడం, హఠాత్తుగా కళ్లు తిరగడం లేదా తల తిరిగినట్లు కావడం మరొక ముఖ్యమైన లక్షణం. ఇలాంటి తీవ్రమైన అలసట ఉన్నా మైకం ఉన్నా జాగ్రత్త పడాలి.
గుండెపోటు సంకేతాలు కొన్నిసార్లు అజీర్ణం, గ్యాస్ లేదా కడుపులో వికారంగా అనిపించడం వంటి రూపాల్లో కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలను ఎప్పుడు కూడా తేలియకగా తీసుకోవద్దు.
ఛాతిలో మొదలై ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడకు వ్యాపించే నొప్పిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచిస్తున్నారు వైద్యులు. వెంటనే ఆస్పత్రికి వెళ్లడం ఉత్తమం.
ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ప్రాణరక్షణకు ఎంతో ముఖ్యం.