AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: ఏంటీ.. ఈ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ సీఎం విజయ్ పాడారా.. ? లిస్ట్ మొత్తం ట్రెండింగే..

దక్షిణాదిలోని టాప్ హీరోలలో విజయ్ దళపతి ఒకరు. ఇటీవలే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్.. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు విజయ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. హీరోగా, రాజకీయ నాయకుడిగానే కాకుండా విజయ్ మంచి సింగర్అని మీకు తలుసా.. ? అవును తన కెరీర్ మొ త్తంలో దాదాపు 25కి పైగా పాటలు పాడారు విజయ్.

Vijay Thalapathy: ఏంటీ.. ఈ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ సీఎం విజయ్ పాడారా.. ? లిస్ట్ మొత్తం ట్రెండింగే..
Vijay Thalapathy Songs
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2026 | 5:11 PM

Share

దక్షిణాది సినిమా సూపర్‌స్టార్ విజయ్ దళపతి 52వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఆయన అద్భుతమైన నటన, డ్యాన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మీకు తెలుసా.. విజయ్ హీరో మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. అవును.. ఆయన ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ వంటి సంగీత పరిశ్రమలోని దిగ్గజాలతో కలిసి పాడారు. విజయ్ చిత్ర పరిశ్రమలో అనేక ముఖ్యమైన రికార్డులను కలిగి ఉన్నారు. ఆయన నటనలోనూ, సంగీతంలోనూ రాణించారు. తన సినీ కెరీర్‌లో ఇరవై ఐదుకు పైగా సూపర్‌హిట్ పాటలను పాడారు. విజయ్ 1994లో వచ్చిన ‘రసిగన్’ చిత్రంలోని “బాంబే సిటీ సుఖ రోటి” పాటతో సింగర్ గా మారారు. 2005లో వచ్చిన ‘సచిన్’ చిత్రంలోని అతని 25వ పాట “వాడి వాడి” అతని మొదటి పాట. తన 25వ పాటను రికార్డ్ చేసిన తర్వాత, అతను పూర్తిగా నటనపై దృష్టి పెట్టడానికి గానానికి విరామం తీసుకున్నాడు. 2012లో వచ్చిన ‘తుపాకి’ చిత్రంలోని సూపర్ హిట్ పాట ‘గూగుల్ గూగుల్’తో అతను గాన ప్రపంచంలోకి మరోసారి ఎంట్రీ ఇచ్చాడు.

‘గూగుల్ గూగుల్’ పాటకు గాను ఆయన విజయ్ అవార్డ్స్‌లో ‘ఫేవరేట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకోవడమే కాకుండా, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ‘బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్’ విభాగంలో నామినేషన్ కూడా పొందారు. తన అద్భుతమైన పాటలకు గాను, అతను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా రెండుసార్లు నామినేట్ అయ్యారు. మొదటిసారి 2015లో ‘యెండి యెండి’ పాటకు, అలాగే రెండవసారి 2016లో ‘సెల్ఫీ పుల్లా’ పాటకు ఎంపికయ్యారు. చిత్ర పరిశ్రమలో నటనలోనే కాకుండా గాయకులుగానూ అంతటి ఖ్యాతిని సంపాదించిన నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. విజయ్ ఆ కొద్దిమందిలో ఒకరు. ఆయన తెరపై కనిపించడమే కాకుండా, మైక్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంటారు.

విజయ్ పాడిన కొన్ని పాటలు.. 1. తలపతి కచేరి (Thalapathy Kacheri): ‘జన నాయగన్’ సినిమాలోని ఈ మాస్ సాంగ్‌ను అనిరుధ్ రవిచందర్ సంగీతంలో విజయ్ ఆలపించారు.

2. చెల్లా మగళే (Chella Magale): ‘జన నాయగన్’ చిత్రంలోని ఈ అందమైన ఎమోషనల్ , క్యూట్ సాంగ్‌ను కూడా ఆయనే పాడారు

3. విజిల్ పోడు (Whistle Podu): ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) మూవీలో యువన్ శంకర్ రాజా సంగీతంలో పాడిన ఎనర్జిటిక్ సాంగ్.

4. చిన్న చిన్న కంగళ్ (Chinna Chinna Kangal): ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రంలోని మరొక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్.

5. నా రెడీ (Naa Ready): ‘లియో’ సినిమాలోని ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌ను అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్‌లో విజయ్ పాడారు.

6. రంజితమే (Ranjithame): తెలుగు, తమిళంలో భారీ హిట్ అయిన ‘వారసుడు’ (Varisu) సినిమాలోని ఈ డ్యాన్స్ నంబర్‌ను విజయ్, ఎమ్.ఎమ్. మానసితో కలిసి పాడారు.

7. జాలీ ఓ జింఖానా (Jolly O Gymkhana): ‘బీస్ట్’ సినిమాలోని ఈ పెప్పీ , ఫన్ సాంగ్‌ను విజయ్ తనదైన శైలిలో ఆలపించారు.

8. కుట్టి స్టోరీ (Kutti Story): ‘మాస్టర్’ సినిమాలోని ఈ మోటివేషనల్ సాంగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

9. వెరితనం (Verithanam): ‘బిగిల్’ (విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో విజయ్ పాడిన పక్కా లోకల్ మాస్ సాంగ్.

10. గూగుల్ గూగుల్ (Google Google): ‘తుపాకీ’ సినిమాలోని ఈ ట్రెండీ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది.

11. సెల్ఫీ పుల్లా (Selfie Pulla): ‘కత్తి’ చిత్రంలో అనిరుధ్ సంగీతంలో పాడిన సూపర్ హిట్ యూత్ ఫుల్ సాంగ్.

12. చెల్లా కుట్టి (Chella Kutti): ‘తేరి’ (పోలీసోడు) సినిమాలోని మెలోడియస్ డ్యూయెట్ సాంగ్.

ఇంకా మరెన్నో పాటలు పాడారు విజయ్..

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ప్రశ్నలు & సమాధానాలు

ప్రశ్న : విజయ్ దళపతి సినీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు..

జవాబు : 4 దశాబ్దాలు.. (బాల నటుడిగా కలిపి), హీరోగా 34 సంవత్సరాలు.

ప్రశ్న : విజయ్ దళపతి సొంత పార్టీ పేరు ఏమిటీ ?

జవాబు : తమిళగ వెట్రి కజగం (TVK )

ప్రశ్న : హీరోగా విజయ్ మొదటి సినిమా ఏదీ.. ?

జవాబు : 1992లో నాలయ్య తీర్పు సినిమా. (విజయ్ వయసు 18 సంవత్సరాలు)

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్
దేవాలయ మొదటి మెట్టును తాకి కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? చాలా మంది
దేవాలయ మొదటి మెట్టును తాకి కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? చాలా మంది
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడే భారత్ విధ్వంసక జట్టు ఇదే?
ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడే భారత్ విధ్వంసక జట్టు ఇదే?
మూడు చేపల కథ.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ నష్టం తథ్యం..!
మూడు చేపల కథ.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ నష్టం తథ్యం..!
మీ ఇంట్లో ఉన్నది నిజంగా దెయ్యమేనా.. లేక మీ భ్రమనా? నిపుణుల వివరణ!
మీ ఇంట్లో ఉన్నది నిజంగా దెయ్యమేనా.. లేక మీ భ్రమనా? నిపుణుల వివరణ!