AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

సీనియర్ నటుడు సమేత గాంధీ.. తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాతో పాపులర్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే రాజన్న సినిమాకు తనకు ఇచ్చిన పారితోషికం గురించి రివీల్ చేశారు.

Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..
Sammeta Gandhi
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2026 | 5:47 PM

Share

సీనియర్ నటుడు సమేత గాంధీ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నాగార్జున నటించిన రాజన్న సినిమాలో తన పాత్రకు నంది అవార్డు అందుకున్న తర్వాత తన కెరీర్‌ మలుపు తిరిగిందని, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా 150కి పైగా చిత్రాలలో నటించానని ఆయన వివరించారు. గాంధీ తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. స్కూల్లో వెనుక బెంచీలో కూర్చుని స్నేహితులతో కలిసి పాటలు పాడుకోవడం, మామిడికాయలు దొంగిలించి తోటి లేడీస్ స్టూడెంట్స్‌కు ఇవ్వడం వంటి సరదా సంఘటనలను వివరించారు. తన బాల్యంలో పెద్దగా బాధలు లేవని, క్రమశిక్షణ, సమయపాలనకు చిన్నతనం నుంచే అలవాటు పడ్డానని తెలిపారు. ఉదయం 8:30 గంటలకు స్కూలుకు వెళ్లాలంటే, అదే సమయానికి టిఫిన్ రెడీగా ఉండాలని, లేకపోతే కోపం వచ్చి తినకుండా వెళ్ళిపోయేవాడినని, తన తల్లి తన వెనుక పడి బ్రతిమలాడేదని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

తన వ్యక్తిగత జీవితంలో అత్యంత బాధాకరమైన ఘట్టం 2008లో తన భార్య మరణమని సమేత గాంధీ పేర్కొన్నారు. 25 సంవత్సరాల వయస్సులోనే డయాబెటిస్ బారిన పడిన తన భార్య, చివరకు అనారోగ్యంతో మృతి చెందారని తెలిపారు. హాస్పిటల్లో ఆమె మరణవార్త విన్నప్పుడు తట్టుకోలేక పెద్దగా కేకలు వేశానని, ఆమె తన పూర్తి సినీ కెరీర్ విజయాన్ని చూడలేకపోయిందనే బాధ ఇప్పటికీ వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నంది అవార్డు అందుకున్నప్పుడు ఆమె ఎంతో సంతోషించి, తనను బాగా ప్రోత్సహించిందని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

ప్రస్తుతం మోతీ నగర్ పార్కులో దాదాపు 30 మంది స్నేహితులతో కలిసి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తానని అన్నారు. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవని, ఆనందంగా కొనసాగుతోందని వివరించారు. సంతోషంగా జీవించడానికి నిస్వార్థంగా ఉండడమే మార్గమని గాంధీ సూచించారు. మనసులో దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడాలని, అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రపంచ యుద్ధాలు, రాజకీయాల వంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, మన అదుపులో లేనివాటిని వదిలిపెట్టి, తమ సంతోషంపై దృష్టి పెట్టాలని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Follow Us