Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ప్రముఖ నటుడు ఆనంద్ భారతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై, వెండితెరపై ఎన్నో సీరియల్స్, సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తమిలంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన నటుడు ఆనంద్ భారతి, తన కెరీర్ ఆరంభం, సీను చిత్రం అనుభవాలు వ్యక్తిగత ఆర్థిక సవాళ్లపై ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలోనే మంచి పేరు వచ్చినా, తాను విలన్‌గా అనేక చిత్రాల్లో నటించానని తెలిపారు. దొంగ దొంగ చిత్రం తర్వాత గానీ, అంతకుముందు గానీ స్టార్ హీరో కావాలనే మైండ్‌సెట్ లేదని ఆయన పేర్కొన్నారు. 1993-94 కాలంలో తనకు ఒక్కో సినిమాకు 3-5 లక్షల రూపాయల పారితోషికం లభించిందని, అప్పట్లో అది పెద్ద మొత్తమని ఆనంద్ భారతి గుర్తుచేసుకున్నారు. పది సినిమాలకు అడ్వాన్స్ తీసుకుంటే, అప్పుడు 10 లక్షల రూపాయలతో ఎకరాల కొద్దీ భూమిని కొనుగోలు చేయగలిగేవాళ్లమని చెప్పారు. బిజీ హీరోగా పది, పన్నెండు చిత్రాలు చేస్తూ, అందులో ఒకటి లేదా రెండు విజయవంతమైతే చాలని ఆశించానని తెలిపారు. అయితే, తాను దాదాపు 10-13 చిత్రాలు హీరోగా చేసినప్పటికీ, అన్నీ ఫ్లాప్ అయ్యాయని, తాను హీరోగా ఒక చరిత్ర సృష్టించానని అన్నారు. 25-26 ఏళ్ల వయసులోనే తానూ తమిళంలో కూడా హీరోగా చిత్రాలు చేశానని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
వెంకటేష్‌తో కలిసి నటించిన సీను చిత్రం గురించి మాట్లాడుతూ, ఆ చిత్రంలో తాను వెంకటేష్‌ను డామినేట్ చేసినట్లు వస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. సీను చిత్రం సుల్లామలే అనే తమిళ సినిమా రీమేక్ అని, దర్శకుడు శశి తనకు కథ చెప్పారని తెలిపారు. తమిళ వెర్షన్‌లో వెంకటేష్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదని వివరించారు. వెంకటేష్‌ను తాను వ్యక్తిగతంగా చాలా కాలంగా తెలుసునని, ఆయన తన స్నేహితులకు కూడా సాధారణ స్నేహితుడని చెప్పారు. వెంకటేష్ కజిన్ అరుణ, తన క్లోజ్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుందని, ఆ పార్టీలలో కూడా వెంకటేష్ ఎప్పుడూ తన సన్నివేశాలపై జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన చాలా మర్యాదస్థుడని, ఆ చిత్రంలో నటించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు స్టార్‌ను డామినేట్ చేయడం చూడలేరనేది అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ల గురించి మాట్లాడుతూ, తన ఖాతాలో 50 లక్షల రూపాయలు ఉండేవని, వాటితో కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాక కరోనా వచ్చిందని ఆనంద్ భారతి తెలిపారు. కరోనా ప్రభావంతో ఆ 50 లక్షల రూపాయలు పూర్తిగా పోయాయని, తన ఖాతా జీరో అయ్యిందని, ఇంట్లో అవసరాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
