AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత ప్రీమియం కట్టినా.. సిగరేట్ తాగే అలవాటు ఉంటే ఇన్సూరెన్స్ రాదా? రూల్స్ ఇవే!

బీమా తీసుకునేటప్పుడు ధూమపానం, సామాజిక పొగాకు అలవాట్లను బీమా సంస్థలు ఎలా చూస్తాయో ఈ వ్యాసం వివరిస్తుంది. అప్పుడప్పుడు సిగరెట్లు తాగే సోషల్ స్మోకర్లను కూడా పొగాకు వినియోగదారులుగానే పరిగణించి, అధిక ప్రీమియంలు వసూలు చేస్తాయి. నిజాయితీగా సమాచారం ఇవ్వకపోతే క్లెయిమ్‌ల తిరస్కరణ, పాలసీ రద్దుకు దారితీయవచ్చు.

ఎంత ప్రీమియం కట్టినా.. సిగరేట్ తాగే అలవాటు ఉంటే ఇన్సూరెన్స్ రాదా? రూల్స్ ఇవే!
Smoking
SN Pasha
|

Updated on: Jun 22, 2026 | 3:47 PM

Share

హెల్త్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, వృత్తి వంటి అంశాలను బీమా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా ధూమపానం చేసే అలవాటు ఉన్నవారిని అధిక ప్రమాదం ఉన్న వర్గంగా పరిగణించడం సాధారణం. అయితే చాలామందికి.. ఏం అప్పుడప్పుడు మాత్రమే సిగరెట్ తాగుతాం, అంటే సోషల్ స్మోకర్లం కదా మమ్మల్ని కూడా సిగరేట్ తాగేవారిగానే ఇన్సూరెన్స్ కంపెనీలు లెక్కేస్తాయా? అనే డౌట్ ఉంటుంది.

ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న నిపుణుల ప్రకారం.. చాలా బీమా సంస్థలు పొగాకు వినియోగాన్ని కేవలం రోజువారీ అలవాటుగా మాత్రమే కాకుండా, ఏ రూపంలోనైనా ఉపయోగిస్తున్నారా లేదా అనే కోణంలో పరిశీలిస్తాయి. స్నేహితులతో పార్టీలు, ప్రత్యేక సందర్భాలు లేదా విహారయాత్రల సమయంలో మాత్రమే సిగరెట్లు కాల్చే వ్యక్తులు తమను తాము ధూమపానం చేసేవారిగా భావించకపోయినా, బీమా సంస్థల దృష్టిలో వారు పొగాకు వినియోగదారులుగానే పరిగణించబడే అవకాశం ఉంది. బీమా దరఖాస్తు ఫారమ్‌లలో సాధారణంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం గురించి ప్రశ్నలు ఉంటాయి. సిగరెట్లు, బీడీలు, సిగార్లు, నమిలే పొగాకు వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారా అని అడుగుతారు. దీనికి నిజాయితీగా సమాధానం ఇవ్వడం అత్యంత కీలకం.

ఎందుకంటే ధూమపానం చేసే వారిలో గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని బీమా సంస్థలు భావిస్తాయి. అందుకే వారి ప్రీమియంలు సాధారణంగా ధూమపానం చేయని వారి కంటే ఎక్కువగా ఉండవచ్చు. అధిక విలువ గల పాలసీల విషయంలో లేదా వయోవృద్ధుల కోసం బీమా సంస్థలు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తాయి. రక్తం, మూత్రం వంటి నమూనాల ద్వారా పొగాకు వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకవేళ దరఖాస్తులో ధూమపానం చేయనని పేర్కొని, పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వస్తే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో వివాదాలు తలెత్తవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ ప్రీమియం కోసం ధూమపాన అలవాటును దాచిపెట్టడం కంటే, నిజమైన సమాచారాన్ని వెల్లడించడం మంచిది. ఇది భవిష్యత్తులో పాలసీ రద్దు, క్లెయిమ్ తిరస్కరణ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ధూమపానం పూర్తిగా మానేసిన వ్యక్తులకు కొన్ని బీమా సంస్థలు నిర్దిష్ట కాలం తర్వాత ధూమపానం చేయని వారి కేటగిరీలో ప్రీమియం ప్రయోజనాలు కూడా అందించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us