AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salary Account: శాలరీ బ్యాంక్ అకౌంట్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్ కదా.. ఈ పని చేస్తే డబ్బులు ఆదా..

మీరు కొత్తగా ఉద్యోగంలో చేరగానే జీతం జమ చేసేందుకు శాలరీ అకౌంట్ అనేది అందిస్తూ ఉంటారు. ఒక్కొ కంపెనీ ఒక్కొ బ్యాంకుతో డీల్ కుదుర్చుకుని ఉద్యోగులకు శాలరీ అకౌంట్‌ను ఇప్పిస్తూ ఉంటాయి. అయితే సాధారణ అకౌంట్ కాదు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Salary Account: శాలరీ బ్యాంక్ అకౌంట్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్ కదా.. ఈ పని చేస్తే డబ్బులు ఆదా..
Salary Bank Account
Venkatrao Lella
|

Updated on: Jun 22, 2026 | 1:00 PM

Share

ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరితే జీతం జమ చేసేందుకు శాలరీ అకౌంట్ అనేది అందిస్తూ ఉంటారు. ఏదైనా బ్యాంకుతో కంపెనీ ఒప్పందం చేసుకుని జీతం అకౌంట్లను తమ ఉద్యోగులకు ఓపెన్ చేయిస్తూ ఉంటుంది. అయితే కేవలం జీతం డబ్బులు విత్‌డ్రా చేయడానికి, ఖర్చు చేయడానికి మాత్రమే ఈ అకౌంట్ ఉపయోపడుతుందని చాలామంది అనుకుంటారు. అయితే ఈ ఖాతాతో ఉన్న బెనిఫిట్స్, ఫీచర్ల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్యాంకులు ఈ ప్రయోజనాల గురించి ఉద్యోగులకు ఓపెన్‌గా చెప్పు. దీనివల్ల శాలరీ అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మీ జీతం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నట్లయితే.. మీకు జరిగే లాభాలేంటి అనే విషయాలు ఇందులో చూద్దాం.

మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

-శాలరీ అకౌంట్‌కు ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్లో జీరో ఉన్నా బ్యాంకులు ఎటువంటి జరిమానాలు విధించవు. అంతేకాకుండా చాలా బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. దీని వల్ల మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఒక నిర్దిష్ట పరిమితి వరకు నిధులను ఉపసంహరించుకోవచ్చు. అనుకోని ఖర్చులు, అత్యవసర పరిస్థితులలో ఈ ఫీచర్ బాగా ఉపయోడపడుతూ ఉంటుంది.

సులువుగా రుణం పొందవచ్చు..

జీతం అకౌంట్ ఉన్నవారి ఆదాయ రికార్డులు బ్యాంకు దగ్గర అందుబాటులో ఉంటాయి. దీంతో వీరిని తక్కువ రిస్క్ ఉన్న కస్టమర్లుగా బ్యాంకులు పరిగణిస్తాయి. దీనివల్ల పర్సనల్ లోన్, హోం లోన్, వెహికల్ లోన్ వంటి సేవలను పొందడం సులభం అవుతుంది. వీరికి సాధారణ కస్టమర్లతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా మెరుగ్గా ఉంటాయి.

డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌ ప్రయోజనాలు

చాలా బ్యాంకులు శాలరీ అకౌంట్‌కు ఉచిత డెబిట్ కార్డు, చెక్‌బుక్‌ను అందిస్తాయి. వీటికి ఎలాంటి అదనపు శాలరీలను వసూలు చేయరు. అలాగే నెఫ్ట్, ఆర్బీజీఎస్, IMPS వంటి డిజిటల్ లావాదేవీలకు కూడా ఛార్జీలు ఉండవు. దీనివల్ల ఆన్‌లైన్‌లో డబ్బు పంపడం, చెల్లింపులు చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది.

క్రెడిట్ కార్డులు, భీమా కవరేజీ

చాలా బ్యాంకులు శాలరీ అకౌంట్ ఖాతాదారులకు తక్కువ లేదా వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను అందిస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, ఇతర ఆఫర్లు ఇందులో ఉంటాయి. కొన్ని జీతం ఖాతాలలో యాక్సిడెంటల్, హెల్త్ ఇన్యూరెన్స్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రత్యేక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా మీకు బీమా లభిస్తుంది

ప్రయారిటీ బ్యాంకింగ్ సౌకర్యం

చాలా బ్యాంకులు అధిక ఆదాయం ఉన్న కస్టమర్ల కోసం ప్రయారిటీ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిలో ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్లు, ప్రత్యేక కౌంటర్లు, వేగవంతమైన సేవలు అందుతాయి. అలాగే ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తాయి. ఇక నెలకు నిర్దిష్ట సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను కూడా ఉపయోగించుకోవచ్చు

Follow Us