నయనతార గుండుతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమలలో తలనీలాలు సమర్పించారని ప్రచారం జరుగుతుండగా, ఆమె టీమ్ స్పష్టతనిచ్చింది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించిన నకిలీ చిత్రాలని, నయనతార గుండు చేయించుకోలేదని ధ్రువీకరించింది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని నెటిజన్లు కోరుతున్నారు.