AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా.. ఇవి తెలిస్తే నోరెళ్లబెడతారు..

చిన్న అల్లం ముక్క శరీరంలో ఎంతటి అద్భుతాలు చేస్తుందో తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు. జీర్ణ సమస్యలు, వికారం, అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ముఖంపై ముడతలను పోగొట్టే శక్తి అల్లానికి ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వంటింటి చిట్కాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా.. ఇవి తెలిస్తే నోరెళ్లబెడతారు..
Ginger Health Benefits
Krishna S
|

Updated on: Aug 19, 2026 | 3:20 PM

Share

మనం రోజూ వంటల్లో రుచి కోసం, సువాసన కోసం ఉపయోగించే సాధారణ అల్లం కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, ఎన్నో రోగాలను నయం చేసే అద్భుతమైన సహజ ఔషధం. ఆయుర్వేదంలో అల్లానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఇది సులభంగా జీర్ణం కావడమే కాకుండా మనం తినే ఇతర ఆహార పదార్థాలు కూడా సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పేగుల్లో పేరుకుపోయే చెడు సూక్ష్మక్రిములను నాశనం చేయడంతో పాటు కాలేయాన్ని సహజంగా శుభ్రపరచడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలలో కనిపించే వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యల నుంచి ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అల్లం శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తూ గుండెకు రక్షణగా నిలుస్తుంది. ఇది రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, గుండె, శ్వాసకోశ కండరాలు సజావుగా పనిచేయడానికి తోడ్పడుతుంది. రోజూ మన ఆహారంలో చిన్న అల్లం ముక్కను భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది. ఆకలి మందగించిన వారికి, పైత్య సమస్యలతో బాధపడేవారికి అల్లం గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఆకలి లేనివారు అల్లం, ధనియాలు కలిపి నూరి తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే పైత్యరసం అధికమై వికారంగా అనిపించినప్పుడు అల్లం తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి తేనెలో నానబెట్టి, రోజూ ఉదయం పరగడుపున ఒక ముక్క తింటే పైత్యం తగ్గి వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది.

కీళ్ల నొప్పులు, శరీర బరువును తగ్గించడంలోనూ అల్లం విశేష ఫలితాలనిస్తుంది. బెల్లంతో కలిపిన అల్లం రసం తాగడం వల్ల కీళ్లవాతం, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒక అల్లం ముక్కను తురిమి గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే, నడుము చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు కరుగుతుంది. చల్లటి వాతావరణం లేదా మంచు వల్ల వచ్చే తలనొప్పులకు అల్లం ముద్దను నూరి నుదిటిపై లేపనంగా రాస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. కడుపు ఉబ్బరం తగ్గడానికి అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ అల్లం ముక్కలు వేసి మరిగించి, వడకట్టి, కొన్ని చుక్కల తేనె కలిపి తాగితే కడుపు ఉబ్బరం తక్షణమే తగ్గుతుంది. అలాగే అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి తేనెలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే ముఖంపై ముడతలు తగ్గి చర్మం ఎంతో యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

మహిళల్లో ఋతుస్రావ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పికి అల్లం కషాయం దివ్యౌషధంలా పనిచేస్తుంది. అల్లం ముక్కలను ఒక గ్లాసు నీటిలో వేసి నీరు సగానికి తగ్గే వరకు మరిగించి, వడకట్టిన ఆ నీటిలో అరటిపండు తొక్కను కలిపి రోజుకు రెండుసార్లు ఒక టీస్పూన్ చొప్పున తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ సహజ సిద్ధమైన వంటింటి చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన, చురుకైన జీవనాన్ని గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..
గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!