చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి సంపాదించి పెట్టలేదని తండ్రి వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు కొడుకు నిరాకరించాడు. దీంతో పెద్ద కూతురు నాగరత్నం ముందుకు వచ్చి, తండ్రికి తలకొరివి పెట్టి చివరి వీడ్కోలు పలికింది. కొడుకు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కూతురిని ప్రశంసించారు.